ఫార్ములా ఈ-కార్ రేస్‌పై విచారణకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. న్యాయ నిపుణుల సలహా మేరకు గవర్నర్ అనుమతి ఇచ్చారన్నారు. ఫార్ములా-ఈ రేస్‌తో వచ్చిన పెట్టుబడుల లెక్క ACB తేల్చుతుందన్నారు పొంగులేటి. ఫార్ములా-ఈ రేస్ అవకతవకలపై కేబినెట్ చర్చించిందని.. ఈ కేసులో అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిదేనన్నారు. కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతి ఇప్పటికే లభించిందని… అరెస్ట్ చేస్తారో లేదో తెలియదని.. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందన్నారు మంత్రి పొంగులేటి. విచారణకు గవర్నర్ అనుమతి ఇస్తూ జారీ చేసిన ఫైల్‌ను సోమవారం రాత్రి, లేదా మంగళవారం సీఎస్.. ఏసీబీకి పంపిస్తారని చెప్పారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చిట్‌చాట్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో వరదల వల్ల ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదన్నారు. వరదల వల్ల ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు రాగానే రియల్ ఎస్టేట్ అమరావతికి పోతుంది అనేది ప్రచారం మాత్రమేనన్నారు మంత్రి. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోలేదని.. హైదరాబాద్, బెంగళూరుకు ఇన్వెస్టర్లు వస్తున్నారన్నారు. చిట్‌చాట్‌లో మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అప్పులపై బీఆర్ఎస్ నిజాలు తెలుసుకోవాలని సూచించారు. కార్పొరేషన్ పేరుతో చేసే అప్పులు సైతం ప్రభుత్వం ఖాతాలోకి వస్తాయన్న విషయం కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. BRS నేతలు మొత్తం లెక్కలు బయటపెట్టాలని.. తెలంగాణకు రూ.7.2 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో ఎవరి పాత్ర వారిదేనని, ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం వాళ్ల హక్కు అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కొసరుతో కొట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనతో వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడాలనే కోరిక ఉందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఎలాంటి వ్యతిరేకత లేదని.. వైఎస్ఆర్ సమయంలోనూ ఇలానే ప్రచారం జరిగిందన్నారు. అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీనే రాష్ట్రంలో అమలు జరుగుతుందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..