Uttam Kumar Reddy: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Uttam Kumar Reddy:తెలంగాణ మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్ల నుండి ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న నేను.. ఎప్పుడు..
Uttam Kumar Reddy:తెలంగాణ మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్ల నుండి ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న నేను.. ఎప్పుడు ఎలాంటి ప్రభుత్వాన్ని చూడలేదని అన్నారు. విచిత్రమైన పాలన తెలంగాణ (Telangana)లో కనిపిస్తుందని ఆరోపించారు. మంథని సంఘటనలో భార్యాభర్తలను హత్య చేయబడితే ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నుండి కార్యకర్త వరకు సాండ్, ల్యాండ్, వైన్స్ మైన్స్ అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా..? అని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. పోలీసులకు ఉమ్మడి రాష్టంలో మంచి పేరు ఉండేదని, ఇప్పుడు ఈ ప్రభుత్వంతో కలిసి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వానికి సహకరించే వాల్లకు మాత్రమే పోస్టింగ్‌లు ఇస్తున్నారని ఆరోపించారు.త్వనికి సహరించేవాళ్లకు మాత్రమే పోస్టింగ్ ఇస్తున్నారు. అదే నిజాయితీ గల అధికారులకు పోస్టింగ్ ఇవ్వటం లేదని, హైదరాబాద్‌లో ఐదు డీసీపీ పోస్టులు ఉంటే ముగ్గురు ఆటాచ్మెంట్‌లో ఉన్నారన్నారు.
ఎమ్మెల్యేలు 5 లక్షలు, 20 లక్షలు తీసుకొని పోలీసులను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారని మండిపడ్డారు. సంతోష్ కుమార్ కి పోలీస్ వ్యవస్థ కి ఏంటి సంబంధం లేదని, ఆయన ఎందుకు ఈ వ్యవస్థల్లో తలదూర్చుతున్నాడని ప్రశ్నించారు. ఆయన చెప్తేనే ప్రమోషన్స్ పోస్టులు ఎందుకు పడుతున్నాయి.. సీఎం కేసీఆర్ బంధువు అయితే సరిపోతుందా..? అని ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఇవి కూడా చదవండి: