
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలోని తన ఫామ్‌హౌస్‌లో గురువారం రాత్రి జారిపడటంతో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తుంటి భాగంలో గాయమైంది. కేసీఆర్ తుంటి ఎముకకు స్వల్ప గాయమైందని, నిపుణుల సంరక్షణలో ఉన్నారని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కె.కవిత తెలిపారు. అందరి మద్దతు, దీవెనలతో నాన్న త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ట్వీట్ చేశారు – కేసీఆర్‌కి యశోదా ఆస్పత్రిలోని 9వ ఫ్లోర్‌లో చికిత్స కొనసాగుతోంది. ఇవాళ పూర్తి టెస్టులు చేసిన తర్వాత వైద్యులు తర్వాత హెల్త్ బులెటిన్ ఇస్తారని తెలుస్తోంది.
BRS supremo KCR Garu sustained a minor injury and is currently under expert care in the hospital. With the support and well-wishes pouring in, Dad will be absolutely fine soon.
Grateful for all the love 🙏🏼— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 8, 2023
మరోవైపు కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కేసీఆర్ గాయపడ్డారని తెలిసి బాధకలిగిందన్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. గాయం నుంచి కేసీఆర్ కోలుకోవాలి అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
Distressed to know that former Telangana CM Shri KCR Garu has suffered an injury. I pray for his speedy recovery and good health.
— Narendra Modi (@narendramodi) December 8, 2023
మాజీ సీఎం కేసీఅర్ యశోదా ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వం తరపున ఐఏఎస్ రిజ్వీను యశోదాకు పంపి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో రిజ్వీ మాట్లాడారు. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి కూడా పోలీస్ మానిటరింగ్‌ను పెంచారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను పరామర్శించేందుకు పార్టీ నేతలంతా యశోదాకి చేరుకుంటున్నారు.
పార్టీ ముఖ్యనేతలతోపాటు, కార్యకర్తలు కూడా సోమాజిగూడ యశోదా ప్రాంతానికి పెద్ద ఎత్తున వస్తున్నారు.
నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి చెందిన వెంటనే కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌కు తన రాజీనామాను సమర్పించిన ఆయన గత తొమ్మిదేళ్లుగా ఉంటున్న నివాసం, కార్యాలయాన్ని ఖాళీ చేశారు. గత కొద్ది రోజులుగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 119 స్థానాలకు గాను కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకోగా.. బీఆర్‌ఎస్ 39 సీట్లకు పరిమితమైంది. రెండు స్థానాల్లో పోటీ చేసిన కేసీఆర్ గజ్వేల్ నుంచి గెలుపొందగా, కామారెడ్డి నుంచి ఓడిపోయారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..