JC Diwakar Reddy in Telangana Assembly: తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయానన్నారు మాజీ పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్‌రెడ్డి. ఆంధ్రను వదిలేసి తెలంగాణకు వస్తానన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సీఎల్పీకి వచ్చారు జేసీ దివాకర్‌రెడ్డి. తన పాత మిత్రులను కలవడానికే వచ్చానని చెప్పారు. మరోవైపు అసెంబ్లీ లాబీలో మంత్రి కేటీఆర్‌ను కలిశారు జేసీ.
తెలంగాణ అసెంబ్లీకి సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకే తాను వచ్చానని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అయితే కేసీఆర్ ను కలవలేకపోయారు. మంత్రి కేటీఆర్ ను జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. తర్వాత కాంగ్రెస్ శాససభ పక్ష కార్యాలయంలో పాత మిత్రులను కలిశారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి ఎందుకు ఓటమి పాలయ్యారో అందరికీ తెలుసునని చెప్పారు. జానారెడ్డి ఓడిపోతానని తాను ముందే చెప్పానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాజకీయాలు, సమాజాలు బాగాలేవని జేసీ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి తనకు తెలియదని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.