AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు గుండెపోటు రావడంతో మంగళవారం కన్నుమూశారు. హైదరాబాద్‌ చింతల్‌బస్తీలోని తన ఇంట్లో.. సోమవారం రాత్రి.. ఛాతీనొప్పి రావడంతో.. వెంటనే నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. సంజీవరావు ఆకస్మిక మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేం దర్‌రెడ్డి సంతాపం ప్రకటిస్తూ.. సంజీవరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి […]

వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 26, 2020 | 5:42 AM

Share

వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు గుండెపోటు రావడంతో మంగళవారం కన్నుమూశారు. హైదరాబాద్‌ చింతల్‌బస్తీలోని తన ఇంట్లో.. సోమవారం రాత్రి.. ఛాతీనొప్పి రావడంతో.. వెంటనే నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. సంజీవరావు ఆకస్మిక మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేం దర్‌రెడ్డి సంతాపం ప్రకటిస్తూ.. సంజీవరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాగా, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఆస్పత్రిలో సంజీవరావు మృతదేహానికి నివాళులర్పించారు. సంజీవరావు.. టీడీపీ, వైఎస్సార్‌సీపీలో కూడా పనిచేశారు. 2014లో ఎన్నికల సమయం లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి.. వికారాబాద్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2018 ఎన్నికల నాటికే అనారోగ్యానికి గురవ్వడంతో.. టికెట్టు దక్కలేదు. బుధవారం వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం గేట్‌వనంపల్లిలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..