Telangana: రాజధానిపై ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి.. మాజీ మంత్రి హరీష్ రావు..
తెలంగాణ రాజధాని విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుట్రలు చేస్తున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నిన్న మొన్నటి వరకు లోక్ సభ ఎన్నికల్లో బిజీగా ఉన్న నేతలు తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీపై మండిపడ్డారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ గురించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాజధాని విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుట్రలు చేస్తున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నిన్న మొన్నటి వరకు లోక్ సభ ఎన్నికల్లో బిజీగా ఉన్న నేతలు తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీపై మండిపడ్డారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ గురించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌పై కాంగ్రెస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మరో పదేళ్లు హైదరాబాద్‌ను కామన్ క్యాపిటల్ చేసే కుట్ర జరుగుతోందన్నారు. గతంలో పదేళ్లు కామన్ క్యాపిటల్ అంటేనే కేసీఆర్ వ్యతిరేకించారనీ గుర్తు చేశారు. ఇప్పుడు తిరిగి మరోసారి అలాంటి ప్రయత్నాలే కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్నాయనీ విమర్శించారు. హైదరాబాద్ ఇక కామన్ క్యాపిటల్ కాదు, తెలంగాణ క్యాపిటల్ అన్నారు హరీశ్‌రావు. కాంగ్రెస్, బీజేపీలకు అధికారమే ముఖ్యమని..కానీ తెలంగాణతో కేసీఆర్‌ది పేగుబంధమన్నారు. హైదరాబాద్‌ను కాపాడుకోవాలంటే.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలన్నారు హరీష్ రావు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..