Telangana Politics: ‘కేటీఆర్‌కు ఎవరో రాంగ్‌ మెసేజ్‌ ఇచ్చారు’.. అమృత్ పథకం చుట్టూ తెలంగాణ రాజకీయం..

|

Sep 24, 2024 | 8:58 PM

అమృత్ పథకం తెలంగాణలో రాజకీయ మంటలు రాజేస్తోంది. అమృత్‌ పథకం టెండర్లపై ఆరోపణలు, సవాళ్లు పొలిటికల్‌ నిప్పులు కురిపిస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం రంజుగా మారింది..

Telangana Politics: ‘కేటీఆర్‌కు ఎవరో రాంగ్‌ మెసేజ్‌ ఇచ్చారు’.. అమృత్ పథకం చుట్టూ తెలంగాణ రాజకీయం..
Ponguleti Srinivas Reddy - KTR
Follow us on

అమృత్ పథకం తెలంగాణలో రాజకీయ మంటలు రాజేస్తోంది. అమృత్‌ పథకం టెండర్లపై ఆరోపణలు, సవాళ్లు పొలిటికల్‌ నిప్పులు కురిపిస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం రంజుగా మారింది.. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్​ను పూర్తిగా ఎవరో తప్పుదోవ పట్టించారని కందాల ఉపేందర్​ రెడ్డి అన్నారు. త్వరలోనే ఈ అంశంపై కేటీఆర్‌తో మాట్లాడతానన్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో తాను బాగానే ఉంటానని తెలిపారు. పొంగులేటి ఇంటి శుభకార్యాలకు కూడా తాను వెళుతుంటానని ఆయన అన్నారు. అయితే రాజకీయాలకు, వ్యాపారానికి సంబంధం లేదన్నారు. అమృత్‌ టెండర్లలో కుంభకోణం జరిగిందని పెద్ద ఇష్యూ చేసి మాట్లాడటం సరికాదన్నారు. అమృత్ పథకంపై కేటీఆర్‌ తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కే చెందిన కందాల ఉపేందర్‌ రెడ్డి.. కీలక కామెంట్స్‌ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.

అమృత్ టెండర్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి చేసిందని ఓవైపు కేటీఆర్ ఆరోపణలు చేస్తుంటే.. మరోవైపు మంత్రి పొంగులేటిని ఉద్దేశించి కందాల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

కేటీఆర్ ఆరోపణలు.. పొంగులేటి కౌంటర్..

సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డికి చెందిన సంస్థకు అర్హతలు లేకున్నప్పటికీ రూ.8,888కోట్ల విలువైన అమృత్‌ పథకం టెండర్‌ను అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. అమృత్‌ టెండర్లలో కేటీఆర్ ఆరోపణల నిజమని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. అబద్ధమని తేలితే కేటీఆర్‌ రాజీనామా చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. సృజన్‌ రెడ్డి స్వయానా తన అల్లుడేనని అమృత్‌ టెండర్లలో ఎలాంటి అవినీతి జరగలేదని.. కేటీఆర్ సమాచారం లేకుండా ఈ అంశంపై మాట్లాడారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు.

కేటీఆర్ ఆరోపణలు నిజమని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. ఆరోపణలు అబద్ధమని తేలితే కేటీఆర్‌ రాజీనామా చేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..