‘‘నువ్వు స్మగ్లర్ కొడుకువి..’’ తండ్రి దొరకలేదని కొడుకును నిర్బంధించిన ఫారెస్ట్ అధికారులు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఫారెస్ట్ సిబ్బంది అత్యుత్సాహం వివాదాస్పదమైంది. ఓ కేసు విచారణలో తండ్రికి బదులు అతని కొడుకుని అదుపులోకి తీసుకుని 12 గంటలు నిర్బంధించారు. దమ్మపేట మండల రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మారుజాతి చెట్లు నరుకుతున్న ఓ ఇద్దరిని రేంజర్ శ్రీనివాస్ అదుపులోకి తీసుకుని దమ్మపేట రేంజ్ కార్యాలయానికి తరలించారు.

‘‘నువ్వు స్మగ్లర్ కొడుకువి..’’ తండ్రి దొరకలేదని కొడుకును నిర్బంధించిన ఫారెస్ట్ అధికారులు!
Ashwaraopeta Forest Office

Edited By:

Updated on: Dec 20, 2025 | 6:19 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఫారెస్ట్ సిబ్బంది అత్యుత్సాహం వివాదాస్పదమైంది. ఓ కేసు విచారణలో తండ్రికి బదులు అతని కొడుకుని అదుపులోకి తీసుకుని 12 గంటలు నిర్బంధించారు. దమ్మపేట మండల రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మారుజాతి చెట్లు నరుకుతున్న ఓ ఇద్దరిని రేంజర్ శ్రీనివాస్ అదుపులోకి తీసుకుని దమ్మపేట రేంజ్ కార్యాలయానికి తరలించారు.

అయితే, ఇదే కేసులో అశ్వరావుపేట పట్టణానికి చెందిన మణి అనే పుల్లల వ్యాపారికి సంబంధం ఉందంటూ మణి ఇంటికి వచ్చిన ఫారెస్ట్ అధికారులు ఇంట్లో నిద్రిస్తున్న మణి కొడుకు సాయిని అదుపులోకి తీసుకుని అశ్వారావుపేట ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. బైక్‌పై వస్తానని చెప్పినా వినకుండా జీపులో తీసుకువెళ్లి నిర్బంధించారు. దీంతో ఏ తప్పు చేయని నన్ను మానసికంగా హింసించారని బాధితుడు గోడు వెళ్లబోసుకున్నాడు. కాలేజీలో చదువుకునే నన్ను ఓ నేరస్తుడిలా తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉదయం 9 నుంచి రాత్రి వరకు సుమారు 12 గంటల పాటు నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేశారని తెలిపాడు. నువ్వు స్మగ్లర్ కొడుకువి అంటూ మాట్లాడటమే కాకుండా తన తల్లిని కూడా దూషించారని, మధ్యాహ్నం భోజనం కూడా పెట్టకుండా హింసించారని బాధితుడు సాయి వాపోయాడు.

కాగా, తన భర్త ఏదైనా తప్పు చేసి ఉంటే చట్టపరంగా ఏ చర్యలు అయినా తీసుకోవచ్చని, కానీ ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో వచ్చి పాలిటెక్నిక్ చదివే ఓ మైనర్‌ను, చేయని తప్పుకి నిర్బంధించడమేమిటని మణి భార్య రాజ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకునే పిల్లవాడిపై నిందలు వేసి నిర్బంధిస్తే మనస్తాపంతో పిల్లలు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వాళ్ళని పట్టుకోకుండా మైనర్లపై ప్రతాపాలు ఏంటని స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..