ఇటీవలే ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏకంగా 60 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రిపాలైయ్యారు. వారం రోజులుగా చికిత్స తీసుకుంటున్న పదిమంది విద్యార్థుల పరిస్థితి ఇప్పటికి మెరుగుపడటం లేదు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులను పరిస్థితి విషమించడంతో హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటన జరిగిన మూడవరోజు ముగ్గురు విద్యార్థులకు పరిస్థితి విషమించడంతో ఇద్దరినీ హైదరాబాద్ నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా మరో నలుగురి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు.
తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉదయం అల్పాహారంగా కిచిడీ తిన్న విద్యార్థుల్లో 12 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. గుర్తించిన హాస్టల్ సిబ్బంది హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను పరీక్షించిన వైద్యులు కలుషిత ఆహారం కారణంగానే అస్వస్థతకు గురైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం 12 మంది విద్యార్థులకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.