రాబోయే 24 గంటలు తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు.. బయటకు రాకండి!
మేఘం...సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఎట్టా ఉంటాదో తెలుసా. లేటెస్టుగా జమ్మూకశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్టులను చూశాం. మెరుపు వరదలు విరుచుకుపడడం గమనించాం. మేఘాలు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే...క్షణాల్లోనే వందలమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచి పెట్టుకుపోతాయి. ఇళ్లు, వాహనాలు బొమ్మల్లా కొట్టుకుపోతాయి. తాజాగా తెలంగాణకు ఇలాంటి హెచ్చరికనే జారీ చేసింది వాతావరణ శాఖ.

మేఘం…సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఎట్టా ఉంటాదో తెలుసా. లేటెస్టుగా జమ్మూకశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్టులను చూశాం. మెరుపు వరదలు విరుచుకుపడడం గమనించాం. మేఘాలు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే…క్షణాల్లోనే వందలమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచి పెట్టుకుపోతాయి. ఇళ్లు, వాహనాలు బొమ్మల్లా కొట్టుకుపోతాయి. తాజాగా తెలంగాణకు ఇలాంటి హెచ్చరికనే జారీ చేసింది వాతావరణ శాఖ.
24 గంటల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కుదిపెయ్యనున్నాయి. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ పేరుతో వార్నింగ్ బెల్స్ మోగించింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలను అప్రమత్తం చేశారు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం, రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారనుందని IMD హెచ్చరించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారి మంగళవారం(ఆగస్టు 19) మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని IMD చెబుతోంది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు వాన ముప్పు ఉంటుందని తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో సోమవారం నాడు.. తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా గద్వాల, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలకు తోడు భారీగా వరదలు వచ్చే అవకాశముందని హెచ్చరించింది. అయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
Flash flood risk over #telangana moderate flash flood risk during next 24 hours pic.twitter.com/MYT9rUHxNc
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) August 18, 2025
సోమవారం నాడు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమురం భీమ్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
