Cockfights in Mancherial: ఏపీలో జోరుగా సాగే కోడి పందాలు ఇప్పుడు తెలంగాణలోనూ ఊపందుకుంటున్నాయి. మంచిర్యాల జిల్లా హజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రహస్యంగా కోడిపందాలు నిర్వహిస్తున్న బరులపై స్థానిక పోలీసులతో కలిసి టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేశారు. ఐదుగురు పందెం రాయుళ్లను అరెస్ట్ చేసి, మూడు పందెం కోళ్ళు, ఆరు కత్తులు, 15వేల నగదు, ఒక తవేరా వాహనం, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆదేశాల నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ సీఐ టి.కిరణ్, ఎస్ఐ ఎస్.లచ్చన్న, హాజీపూర్ ఎస్ఐ చంద్రశేఖర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది హజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముల్కల్ల గ్రామ శివారులో నల్ల పోచమ్మ గుడి ఎదురుగా గల చెట్లలో కొంతమంది పందెం రాయుళ్లు… కోడిపందాలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కోసం హాజీపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పందెం రాయుళ్లను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కిరణ్, ఎస్సై లచ్చన్న, హాజీపూర్ ఎస్ఐ చంద్ర శేఖర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది…సంపత్ కుమార్, వెంకటేష్, ఓంకార్, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్, రాకేష్‌లను సీపీ అభినందించారు.
Also Read:
Madanapalle double murder: మదనపల్లె మర్డర్స్.. తిరుపతి రుయాకు నిందితులు.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?