జగిత్యాల టవర్ సర్కిల్లోని సార్గమ్మ వీధిలో అమ్మాజీ డ్రెస్సెస్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణం బందు చేసి ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే దుకాణం నుంచి మంటలు ఎగిసిపడటం చూసిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దుకాణం వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పక్క దుకాణాలకు వ్యాపించకుండా స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలియల్సి ఉంది. సుమారు రూ. 40 లక్షలకు పైగా నష్టం వాటిలినట్లు దుకాణదారుడు తెలిపారు. పక్క దుకాణదారులు బాణాసంచ కాల్చడంతో షట్టర్ కింది నుంచి అగ్గి రవ్వలు పడి ప్రమాదం జరిగిందని దుకాణదారుడు ఆరోపిస్తున్నాడు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.