Gandhi Bhavan Fighting: గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల ఫైటింగ్.. అంతర్గత కుమ్ములాట.. మధ్యలోకి వెళ్లి సర్దిచెప్పబోయిన మల్లు రవిని..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సేవ్ కాంగ్రెస్ అంటూనే పరస్పరం ఒకరిని ఒకరు తోసుకున్నారు.

Gandhi Bhavan Fighting: గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల ఫైటింగ్.. అంతర్గత కుమ్ములాట.. మధ్యలోకి వెళ్లి సర్దిచెప్పబోయిన మల్లు రవిని..
Gandhi Bhavan Fighting

Updated on: Dec 22, 2022 | 4:31 PM

అంతర్గత కుమ్ములాటలు ఆపండి మొర్రో అని హైకమాండ్‌ దూతగా వచ్చిన దిగ్విజయ్‌ గాంధీభవన్‌లోని వార్‌రూమ్‌లో చెబుతున్నారో లేదో.. అదే రూమ్ బయట గలాట మొదలైంది. మామూలు గలాట కాదు.. గల్లాలు పట్టుకుని నిలదీసుకునేంత స్థాయిలో కొట్లాట. సేవ్ కాంగ్రెస్ అంటూనే పరస్పరం గల్లాలు పట్టుకునే స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. తమకు అన్యాయం జరిగిందని గాంధీభవన్‌కు ఓయూ విద్యార్థి సంఘన నేతలు వచ్చారు. అయితే వారిని సర్ధి చెప్పే ప్రయత్నంలో ఎక్కడ అన్యాయం జరిగిందని నిలదీసే ప్రయత్నం చేశారు మాజీ ఎమ్మెల్యే అనిల్‌. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థి సంఘం నేతలు ఒక్కసారిగా అతని మీదికి వెళ్లారు. దీంతో రెండు వర్గాల మధ్య పెరిగిన మాటామాట మొదలైంది. గొడవ జరుగుతున్న విషయం తెలుసుకున్న ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే అనిల్‌పైకి దూసుకుపోయారు.

ఈ గొడవ జరుగుతున్న సంగతి తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వారి మధ్యలోకి చేరారు. రెండు వర్గాల వారిని సర్ధి చెప్పే ప్రయత్నం చెప్పారు. ఎంతకు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు వినకపోవడంతో క్రమశిక్షణతో ఉండాలంటూ పెద్దగా అరిచారు. విషయం చేయిదాటున్న సంగతి తెలుసుకున్న మల్లు రవి.. మాజీ ఎమ్మెల్యే అనిల్‌ను ఓ గదిలోకి పంపించారు.

అక్కడికి వచ్చిన విద్యార్థి నేతలను వేడుకున్నారు. దండం పెడంతా ఆపండి..! అంటూ మల్లు రవి వేడుకున్నారు. లోపల చర్చలు జరుగుతున్నాయని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. సహకరించాలని అభ్యర్థన.. చేజారుతున్న పరిస్థితులను చూసి ఉద్వేగపూరితంగా మాట్లాడారు మల్లు రవి.

వీడియోను ఒక్కడ చూడండి..