Telangana: రోజూ తాగే వైన్ షాపు ముందు మందుబాబుల ధర్నా.. కారణం తెలిస్తే మీకు కిక్కు ఎక్కుతది
మా సమస్యకు ఎలాగైనా ఈరోజు పరిష్కారం దొరకాల్సిందే.. అంటూ మందుబాబులు వైన్ షాపు ముందు ఆందోళనకు దిగారు. అరెరె.. పెద్ద సమస్యే వచ్చిపడిందే అంటారు వారి ఇబ్బందులు వింటే...

మాములుగా తమ ప్రాంతం నుంచి వైన్ షాపులను తరలించాలని నిరసన తెలిపిన వారిని చూసి ఉంటాం. కానీ రోజూ అదే షాపులో మందు తాగే మద్యం ప్రియులు.. ఆ దుకాణం ఎదురుగా ఆందోళనకు దిగారు. షాపు షట్టర్ మూసేసి రచ్చ చేశారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. లోకల్‌గా ఉన్న శివ సాయి వెంకటేశ్వర వైన్ షాపు ఎదుట ఆందోళన చేపట్టారు. మా గోడు వినండి.. మా కష్టం తీర్చండి అంటూ గొడవ గొడవ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు అందుకున్నారు. అసలు విషయం ఏంటని తెలుసుకునేందుకు అక్కడికి వచ్చిన స్థానికులు.. వారి సమస్య విని నివ్వెరపోయారు. అయ్య బాబాయ్ పెద్ద సమస్యే వచ్చిందిగా అంటూ అక్కడి నుంచి జారకున్నారు. సమాచారం అందడంతో పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. సమస్య ఏంటో చెప్పాలని కోరారు. పొద్దుపొద్దునే డ్యూటీ ఎక్కిన పోలీసులకు వారి సమస్య విని కళ్లు తిరిగినంత పనైంది.
ఏంది.. ఈ విషయానికి ధర్నా చేస్తున్నారా..? సరె.. సర్లే వైన్స్ వాళ్లతో మాట్లాడి సెటిల్ చేస్తాం. ప్రస్తుతానికి ఆందోళన ఆపండి అని పోలీసులు నచ్చజెప్పారు. కానీ మందుబాబులు తమ డిమాండ్లు నెరవేర్చేవరకు.. ఇక్కడి నుంచి కదలమంటూ మొండి పట్టు పట్టారు. దీంతో చేసేదేం లేక.. వారిని స్టేషన్‌కు తరలించి తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చి పంపేశారు. అదంతా ఓకేలే కానీ.. అసలు వారి ఆందోళనకు కారణమేంటి..? అది చెప్పకుండా నాన్చుతున్నారు అనుకుంటున్నారు కదా..? అక్కడికే వస్తున్నాం.
మందుబాబుల ప్రొటెస్ట్‌కి రీజన్.. ఆ షాపులో అన్ని రకాల బ్రాండ్స్ అందుబాటులో ఉండకపోవడం అట. అంతేకాదు.. మందు క్వాలిటీ కూడా పెద్దగా బాగోవడం లేదట. నోట్లో పోసుకుంటే సరుకు తేడాగా ఉందని ఇట్టే తెలిసిపోతుందట. అది అసలు వ్యవహారం.. మందుబాబులు ఈ డిమాండ్స్‌పై మీరేమంటారో కామెంట్ చేయండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
