Manchu Manoj: ఇలాంటి క్రూరమైన లోకంలో బతుకుతున్నందుకు బాధగా ఉంది.. సినీ నటులు మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు

|

Sep 14, 2021 | 3:36 PM

సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణాన్ని యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు.

Manchu Manoj: ఇలాంటి క్రూరమైన లోకంలో బతుకుతున్నందుకు బాధగా ఉంది.. సినీ నటులు మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
Manchu Manoj
Follow us on

Manchu Manoj Comments: సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణాన్ని యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. ఆరేళ్ల బాలిక హత్యాచారానికి గురైన ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడిన దుండగుడిని పోలీసులు ఇంతవరకు పట్టుకోలేకపోయారు. మరోవైపు, చిన్నారి కుటుంబసభ్యులను సినీ నటుడు మంచు మనోజ్ ఇవాళ పరామర్శించారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరేళ్ల బాలికపై ఇలాంటి దారుణానికి పాల్పడటం క్రూరమైన చర్య అని ఆయన అభివర్ణించారు. సభ్య సమాజంలో బతుకుతున్న మనమంతా బాధ్యతాయుతంగా నడుచుకోవాలన్నారు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో ప్రతి ఒక్కరికీ తల్లిదండ్రులు, గురువులు నేర్పించాలని చెప్పారు. నిందితుడి జాడ దొరకలేదని పోలీసులు చెబుతుండటం దారుణమన్న మనోజ్.. ఈఘాతుకానికి కారకుడైన నీచుడిపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చత్తీస్‌గఢ్ లో మూడేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ, ఏడాది తర్వాత కోర్టు తీర్పును వెలువరించిందని గుర్తు చేశారు.

అసలు ఇలాంటి రాక్షసులకు 24 గంటల్లో ఉరిశిక్ష విధించాలని మంచు మనోజ్ డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణమైన లోకంలో బతుకుతున్నందుకు బాధగా ఉందని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాపలేని లోటును తీర్చలేమన్న మనోజ్.. కనీసం ఆ పాప కుటుంబానికైనా అండగా ఉందామని కోరారు. ఈతరం నుంచైనా మగవాడి ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఆయన ఆకాక్షించారు.


Read Also…  Coconut Benefits: కొబ్బరి బోండాలోని నీరు తాగి.. కొబ్బరి పడేస్తున్నారా.. అది తింటే కలిగే ఆరోగ్య ప్రయోజలు ఎన్నో

Sai Dharam Tej: ఆసుపత్రిలో కూడా వదిలి పెట్టరా.? సాయి ధరమ్ తేజ్‌ ప్రమాదంపై ఘాటుగా స్పందించిన నిఖిల్‌.

Coconut Benefits: కొబ్బరి బోండాలోని నీరు తాగి.. కొబ్బరి పడేస్తున్నారా.. అది తింటే కలిగే ఆరోగ్య ప్రయోజలు ఎన్నో