Nehru Zoological Park : సాధారణంగా పిల్లల పుట్టిన రోజు అంటే.. కొత్త బట్టలు, చాక్లెట్స్ పంచటం, కేక్ కట్ చేయించటం, గుడి వెళ్లటం లాంటివి చేస్తుంటారు. మిత్రులు, కుటుంబీకులు ఇచ్చే గిఫ్ట్‌లు తీసుకోవటం పరిపాటి. కానీ,ఇక్కడ ఓ ఆరేళ్ల చిన్నారి తన పుట్టిన రోజు నాడు.. ఎవరూ చేయని ఓ గొప్ప పనిచేసింది. తనుమాత్రమే కాదు.. తన పుట్టిన కానుకగా తన తండ్రితో కూడా అలాంటి గొప్ప కార్యాన్నిచేయించింది. అదేంటంటే… సాధారణంగా చిన్నారులు జూకు వెళితే అక్కడ ఉండే జంతువులను చూసి సంబరపడిపోతుంటారు. కేరింతలు కొడతారు.. జూపార్క్ లో రకరకాల జంతువులు, పక్షులను చూసి వాటితో ఆడుకుంటూ మురిసిపోతుంటారు. ఏనుగులు, ఒంటెలు, గుర్రాల వంటివాటిపైయ సరదాగా చక్కర్లు కొడుతుంటారు.. ఆ తర్వాత ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోతుంటారు.. కానీ, ఇక్కడ ఓ చిన్నారి తన అలాకాదు.. జూ పార్క్‌లో ఉన్న పక్షులను దత్తత తీసుకుంది. వాటి ఆలనా పాలనా చూసుకుంటూ వాటికి ఆహారం అందించేందుకు హామీ ఇచ్చింది. అంతేకాదు.. ఆ చిన్నారి తండ్రి సైతం ఓ కింగ్ కోబ్రాను దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ లో చిన్ని చిన్ని పక్షులు, ఇండియన్ కింగ్ కోబ్రాను దత్తత తీసుకున్న ఆ తండ్రీకూతురు తమ పెద్ద మనస్సును చాటు కున్నారు. దాంతో ఆ ఇద్దరూ అందరి ప్రశంసల్ని అందుకున్నారు.
సాధారణంగా మంచి, మానవత్వం మెండుగా ఉండే చాలా మంది సెలబ్రెటీలు, వీఐపీలు అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకుంటూ ఉంటారు. దానికి మించి.. కుదిరితే ఒకట్రెండు గ్రామాలను కూడా దత్తత తీసుకుని.. ఆ గ్రామాభివృద్ధికి పాటు పడతారు. అలాగే హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్,బాలానగర్ నివాసి అయిన ప్రమోద్ రచ్చ, అతని ఆరేళ్ల కూతురు బేబీ హర్షివి రచ్చ తన ఆరవ పుట్టిన రోజు సందర్భంగా చిన్న పక్షుల్ని దత్తత తీసుకుంది. చిన్నారి తండ్రి ప్రమోద్ రచ్చ ఇండియన్ కింగ్ కోబ్రాను దత్తత తీసుకున్నారు.
ఆగస్టు 27.08.2022న హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఆరు నెలల పాటు 5 చిన్న పక్షులను దత్తత తీసుకుంది. చిన్నారి తండ్రి ప్రమోద్ రచ్చ ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ చేస్తున్నారు. అతడు తన కంపెనీ M/s తరపున నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్‌లో ఆరు నెలల పాటు ఇండియన్ కింగ్ కోబ్రాను దత్తత తీసుకున్నారు. ఇందుకోసం ప్రమోద్ రచ్చ రూ. 20,000/లు జూసిబ్బందికి అందజేశారు. ఇందులో చిన్న పక్షులకు రూ.10,000/- ఇండియన్ కోబ్రాకు రూ. 10,000/- ల చొప్పున ఆన్‌లైన్ చెల్లింపు విధానం ద్వారా దత్తత ఛార్జీల కోసం చెల్లించారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్‌కు పక్షులను దత్తత తీసుకునే అవకాశాన్ని కల్పించినందుకు, పుట్టినరోజు కానుకగా తన బిడ్డ కోరికను తీర్చినందుకు ప్రమోద్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ మేరకు ఎస్. రాజశేఖర్, క్యూరేటర్ నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఆరు నెలల పాటు చిన్న పక్షులు, ఇండియన్ కోబ్రాను దత్తత తీసుకోవటం గొప్ప విషయంగా చెప్పారు. ఆ తండ్రి కూతుళ్లకు వారు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు, కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి జూలో జంతువులను దత్తత తీసుకోవాలని, వన్యప్రాణుల సంరక్షణలో చేతులు కలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి