
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదు నెలల చిన్నారి సహా ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు డివైడర్ ఢీ కొట్టింది. అంతే వేగంగా అవతలి రోడ్డులో విజయవాడ వైపు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఆ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడ్డవారిని చౌటుప్పల్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులను హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వెళ్తున్న కుటుంబ సభ్యులుగా గుర్తించారు. మృతుల్లో సాయికుమార్ (33 ) ఐదు నెలల బాలుడు వీరాన్ష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో ఉన్న ఇద్దరికి తీప్రగాయాలయ్యాయి. రెండు కార్లలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..