Road Accident: పండుగ పూట పెను విషాదం.. దైవ దర్శనానికి వెళ్లివస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..

ఈ విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. దైవదర్శనానికి వెళ్ళిన ఓ కుటుంబం తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు మృత్యువుతో పోరాడుతున్నారు.

Road Accident: పండుగ పూట పెను విషాదం.. దైవ దర్శనానికి వెళ్లివస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..
Auto And Car Road Accident

Edited By:

Updated on: Jan 15, 2024 | 9:27 AM

ఈ విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. దైవదర్శనానికి వెళ్ళిన ఓ కుటుంబం తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు మృత్యువుతో పోరాడుతున్నారు. వారి ఆటోను ఢీకొట్టిన కారులోని ప్రయాణికులు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారులో ఈ ప్రమాదం జరిగింది. కారు – ఆటో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. మృతదేహాలను మార్చురీకి, క్షతగాత్రులను మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ప్రాంగణమంతా కుటుంబ సభ్యుల రోధనలతో మిన్నంటుతుంది.

ఈ ప్రమాదంలో మృతిచెందిన నలుగురు ఓకే కుటుంబానికి చెందిన వారు. వారిలో తల్లి, కొడుకు, మనుమడు , మనవరాలు ఉన్నారు. వీరంతా గూడూరు మండలం చిన్నఎల్లాపూర్ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. మృతులు ఇస్లావత్ శ్రీను, అతని తల్లి, పాప అతని కొడుకు బాలుడు రిత్విక్, కూతురు రిత్వికగా గుర్తించారు. నాగార్జునసాగర్ సమీపంలోని బుడియా బాపు దేవుడిని సందర్శించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గుంజేడులోని ముసలమ్మ దేవతను సందర్శించుకుని మహబూబాబాద్‎కు వస్తున్న కారు – వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. సమయానికి కారులోని ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో కారులో ఉన్నవారు గాయాలతో బయటపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..