Telangana: తమ నేత పుట్టిన రోజు వేడుకలను భిన్నంగా చేసిన ఫ్యాన్స్.. పురుషులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం..

| Edited By: Surya Kala

Jan 09, 2024 | 8:08 PM

ఇప్పుడు తెలంగాణ అంతటా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం ట్రేండింగ్ విషయం కావడంతో అదే అంశాన్ని ఎంచుకున్నారు. అభిమాన నేత జన్మదినోత్సవం రోజున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే పురుషులకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. సూర్యాపేటలో గండూరు ప్రకాష్ అభిమానులు రక్తదానం అన్నదానం, పేదలకు ఉచితంగా దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. దీంతోపాటు పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న బస్సుల్లోకి వెళ్ళి ప్రయాణిస్తున్న పురుషులకు తమ నేత జన్మదిన వేడుక సందర్భాన్ని తెలిపి ఉచితంగా టికెట్లు అందించారు

Telangana: తమ నేత పుట్టిన రోజు వేడుకలను భిన్నంగా చేసిన ఫ్యాన్స్.. పురుషులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం..
Free Bus For Men
Follow us on

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. అయితే అక్కడ పురుషులకు కూడా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. ఇదేంటీ.. తెలంగాణ ప్రభుత్వం కేవలం మహిళలకు మాత్రమే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించిందిగా అనే సందేహం రావచ్చు. మరి పురుషులకు ఉచిత ప్రయాణం ఏంటని అని అనుకుంటున్నారా..? అవును… ఇక్కడ పురుషులకు ఆర్టీసీ ప్రయాణం ఉచితమే. పురుషులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం సౌకర్యం ఎక్కడో తెలుసుకుందాం..

అభిమానులు వారు అభిమానించే ఆరాధించే వ్యక్తులు, నాయకుల జన్మదినోత్సవ వేడుకలను గ్రాండ్ గా జరుపుతుంటారు. అన్న దానం చేయడం , రక్త దానం, దుప్పట్లు, పండ్లు పంపిణీ చేయడం , మొక్కలు నాటడం, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం లాంటివి జనరల్ గా చేస్తుంటారు. కానీ సూర్యాపేటలో బీఆర్ఎస్ యువ నాయకుడు, ప్రముఖ వ్యాపార వేత్త గుండూరి ప్రకాష్ జన్మదిన వేడుకలు మాత్రం రొటీన్ కి భిన్నంగా వినూత్న రీతిలో చేశారు ఆయన మిత్రులు, అభిమానులు. అందరిలా చేస్తే కామన్ ఉంటుందని భావించి డిఫరెంట్ గా ప్లాన్ చేశారు.

ఇప్పుడు తెలంగాణ అంతటా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం ట్రేండింగ్ విషయం కావడంతో అదే అంశాన్ని ఎంచుకున్నారు. అభిమాన నేత జన్మదినోత్సవం రోజున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే పురుషులకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు.

ఇవి కూడా చదవండి

సూర్యాపేటలో గండూరు ప్రకాష్ అభిమానులు రక్తదానం అన్నదానం, పేదలకు ఉచితంగా దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. దీంతోపాటు పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న బస్సుల్లోకి వెళ్ళి ప్రయాణిస్తున్న పురుషులకు తమ నేత జన్మదిన వేడుక సందర్భాన్ని తెలిపి ఉచితంగా టికెట్లు అందించారు. ముందస్తుగా కండక్టర్ కు టికెట్ డబ్బులు చెల్లించి ఆ టిక్కెట్లను పురుషులకు ఉచితంగా ఇచ్చారు.

సంక్రాంతి పండుగ వేళ తమ సొంతూర్లకు వెళ్తున్న మహిళలకు లభించిన ఉచిత ఆర్టీసీ ప్రయాణం బంపర్ ఆఫర్ తమకు కూడా దొరికిందని పురుషులు సంబురపడుతున్నారు . పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం ఆ నోట ఈ నోటా పాకి మొత్తంగా సూర్యాపేటలో వైరల్ అవుతుంది. బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న పురుషులు గుండూరి ప్రకాష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజే కాదు ప్రభుత్వం మహిళలకు ఇచ్చినట్లుగానే పురుషులకు కూడా ప్రతిరోజు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌలభ్యం కలిపిస్తే బాగుండు అని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..