Hyderabad: దారుణం.. ఇద్దరు చిన్నారులతో కలిసి సంపులో దూకిన తల్లి.. చివరకు..
ఫ్యామిలీ ప్లానింగ్ వివాదం ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది.. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను నీటిసంపులో పడేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో జరిగింది.. లక్ష్మణ్, లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం.. ఈ క్రమంలోనే.. ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో భర్తతో వివాదం జరిగింది.

ఫ్యామిలీ ప్లానింగ్ వివాదం ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది.. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను నీటిసంపులో పడేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో జరిగింది.. కామారెడ్డికి చెందిన లక్ష్మణ్, రత్నమ్మ అలియాస్ లక్ష్మి దంపతులు బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. కామారెడ్డి నుంచి బతుకుతెరువు కోసం ప్రగతి నగర్‌కు వచ్చారు. లక్షణ్ ఇటుక బట్టీల్లో రోజువారీ కూలి పనులు చేస్తున్నాడు.. లక్ష్మణ్ – రత్నమ్మ దంపతులకు నలుగురు కొడుకుల సంతానం.. ఈ క్రమంలోనే.. మంగళవారం రాత్రి ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో భర్తతో వివాదం జరిగింది. మనస్తాపానికి గురైన రత్నమ్మ అలియాస్ లక్ష్మి అర్థరాత్రి ఇద్దరు కొడుకులు అరుణ్, సుభాష్ తో ఆత్మహత్యాయత్నం చేసింది.. ఇంట్లో ఉన్న నీటి సంపులో ఇద్దరు బాబులతో పాటు ఆమె దూకింది.. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు. నీరు తక్కువ ఉండటంతో కారణంగా రత్నమ్మ బతికింది. వెంటనే గమనించిన స్థానికులు లక్ష్మిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఇద్దరు పిల్లల మృతదేహాలను గాంధీకి తరలించారు. ప్రాధమిక దర్యాప్తులో కుటుంబ కలహాల నేపథ్యంలో లక్ష్మి ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాచుపల్లి పోలీసులు తెలిపారు.
లక్ష్మణ్ – లక్ష్మికి నలుగురు కొడుకులు సంతానం కాగా.. ఇద్దరు దంపతుల దగ్గర.. మరో ఇద్దరు కామారెడ్డిలో ఉన్న తాత దగ్గర ఉంటున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




