Fake Reporters: టీవీ9 పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతులను మోసం చేసిన ఇద్దరు వ్యక్తుల అట కట్టించారు మంచిర్యాల పోలీసులు. వివరాల్లోకెళితే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సంతోష్ రెడ్డి అనే వ్యక్తి టీవీ9 సంస్థ పేరిట ఫేస్ టూ ఫేస్ పినామనిల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాడు. టీవీ9 సంస్థలో యాంకర్, రిపోర్టర్‌లుగా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఫేక్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాడు. ఈ విషయం టీవీ9 సంస్థకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన రామగుండం కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. నకిలీ రిపోర్టర్ సంపత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అతనితోపాటు.. సంపత్ రెడ్డికి సహకరించిన పులి వెంకటరావు అనే మరో యువకుడిని కూడా అరెస్ట్ చేశారు. నిందితుడు సంపత్ రెడ్డిది జనగాం జిల్లా బచ్చన్నపేటగా గుర్తించారు. నిందితుడి నుంచి టీవీ9 నకిలీ ఐడీ కార్డ్, టీవీ9 పేరుతో ఉన్న బ్రౌచర్స్, రూ.15 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సంపత్, వెంకటరావులపై ఐపీసీ సెక్షన్ 419, 420 , 468 కింద కేసు నమోదు చేశారు.
Also read:
TRP Scam: టీఆర్‌పీ కుంభకోణం కేసులో ఊహించని మలుపు.. అర్నాబ్ గోస్వామి వాట్సాప్ సందేశాలు లీక్..!