Telangana: కారులో దర్జాగా వెళ్తున్న ఏడుగురు సభ్యుల ముఠా.. ఖాకీల తనిఖీల్లో ఖతర్నాక్‌ సీన్‌! కటకటాల్లోకి కేటుగాళ్లు

|

Jun 07, 2022 | 8:01 PM

ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొందరు వ్యక్తులు ఓ ముఠాగా తయారయ్యారు. .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడా, కలివేరు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి గత కొంత కాలంగా..

Telangana: కారులో దర్జాగా వెళ్తున్న ఏడుగురు సభ్యుల ముఠా.. ఖాకీల తనిఖీల్లో ఖతర్నాక్‌ సీన్‌!  కటకటాల్లోకి కేటుగాళ్లు
Untitled 1
Follow us on

ఎన్ని భద్రతా ప్రమాణాలు పాటించినా సరే.. దొంగనోట్లు, వాటి తయారి దారుల అగడాలకు అడ్డుకట్టం పడటం లేదు. అమాయకులను టార్గెట్‌ చేసుకుని కొందరు కేటుగాళ్లు అక్రమ సంపాదనకు తెరతీస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తూ ప్రజల్ని నిండా ముంచేస్తున్నారు. తాజాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొందరు వ్యక్తులు ఓ ముఠాగా తయారయ్యారు. .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడా, కలివేరు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి గత కొంత కాలంగా దొంగ నోట్లు తయారు చేస్తున్నారు. ఆ నోట్లను స్థానికంగా ఉన్న కొంత మందితో కలిసి చలామణి చేస్తున్నారు. అమాయక ఆదివాసీలే లక్ష్యంగా ఈ దొంగనోట్లను చలామణి చేస్తున్నట్టు విచారణలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

సోమవారం రాత్రి ఈ దొంగ నోట్ల ముఠా కారులో వెళ్తుండగా చర్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాంతో ఈ ముఠా గుట్టు రట్టైంది. కారులో తరలిస్తున్న దొంగనోట్లు పట్టుబడ్డాయి. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పట్టుబడి వారిలో ఓ మైనర్ బాలుడు, ఒక యువతి ఉన్నట్టు భద్రాచల ఎస్పీ రోహిత్ తెలిపారు. వారు ప్రయాణిస్తున్న కారు తో పాటు, దొంగ నోట్లు తయారు చేసే కంప్యూటర్, పరికరాలు, గ్రీన్ థ్రెడ్, ప్రింటరు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.