కల్లు కల్తీకి పాల్పడితే ఎంతటివారిపై అయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎక్సైజ్ అధికారులు. వ్యక్తిగత లైసెన్స్ ఉన్నవారు కల్లు బయట అమ్మితే లైసెన్స్‌లు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా చిట్టిగిద్ద ఘటనపై ల్యాబ్ రిపోర్ట్ అందిందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డీసీ ఖురేషీ వెల్లడించారు. ఆ కల్లులో ప్రమాదకరమైన రసాయనాలు వాడినట్లు తేలినట్లు ఆయన చెప్పారు.
వికారాబాద్‌లో ఈనెల ఏడో తేదీన కల్తీ కల్లు తాగి వందల సంఖ్యలో జనం అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు మరణించారు. బాధితుల్లో ఇప్పటికీ కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజల అస్వస్థతకు కారణమైన చిట్టిగిద్ద కల్లు డిపోను అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని కల్లు దుకాణాలను మూసివేశారు. కల్తీ కల్లు ఘటనకు గల కారణాలపై పోలీసులతోపాటు, ఎక్సైజ్ అధికారుల దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై ల్యాబ్ రిపోర్ట్ అధికారులకు అందింది. ఆ కల్లులో ఆల్ఫ్రా జోలం, డైజోఫామ్ కలిపినట్లు వెల్లడైంది. అవి కలిసిన 15 డిపోల లైసెన్స్‌లు సీజ్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కల్లులో సక్రీన్ తప్ప మిగతా రసాయనాలు కలపడం నిషేధమన్నారు.
Also Read: SI Suicide: గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య.. వివాహేతర సంబంధమే కారణమా..!