Karimnagar: తెల్లారి రంగనాయకుల గుట్టపై అదో మాదిరి నల్లటి ఆకారం.. వెళ్లి చూడగా గుండె గుభేల్

ఈ ప్రాంతానికి వెళ్లాలంటే.. భయం.. భయం.. గుండె వేగం కూడా పెరుగుతుంది.. అయితే.. ఈ కొండ కింద.. బంగారు సంపద ఉందనే ప్రచారం చాలా యేళ్లుగా సాగుతుంది.. అయితే.. ఈ ప్రాంతంలో నిరంతరం గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు.. ఈ పరిసర ప్రాంతాల్లో.. క్షుద్ర పూజలు చేస్తున్నారు.. ఇలా చేస్తే.. బంగారు సంపద దొరుకుతుందనే ప్రచారం ఉంది. దీంతో.. కుంకుమ, పసుపు, నిమ్మకాలు.. మట్టితో తయారు చేసిన బొమ్మలు అడుగు. అడుగునా కనబడుతున్నాయి... ఈ బంగారు కొండపై స్పెషల్ స్టోరీ..

Karimnagar: తెల్లారి రంగనాయకుల గుట్టపై అదో మాదిరి నల్లటి ఆకారం.. వెళ్లి చూడగా గుండె గుభేల్
Telugu News

Edited By:

Updated on: May 25, 2025 | 12:52 PM

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సమీపంలో రంగనాయకుల గుట్ట.. ఈ గుట్టను కేంద్రంగా చేసుకొని కాకతీయుల పాలన సాగింది. ఈ గుట్ట సగంలో దట్టమైన చెట్లు, ఈ గుట్ట సమీపంలో భారీ బంగారు సంపద ఉందనే ప్రచారం.. గతంలో పురాతన వస్తువులు లభించాయి. పురాతన శాఖ అధికారులు తవ్వకాలు చేస్తే కొన్ని నాణెలతో పాటు వస్తువులు లభించాయి. అయితే గతంలో కూడా బంగారు నాణెలు లభించాయనే ప్రచారం సాగింది. పోలీసులు పలువురిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే ఈ గుట్ట కేంద్రంగా గుప్త నిధుల ముఠా సంచరిస్తుంది. బంగార ఉందనే నమ్మకంతో పూజలు నిర్వహిస్తున్నారు. చెట్ల మధ్యలో అర్థరాత్రి పూట ఈ తతంగాన్ని కొనసాగిస్తున్నారు. సడెన్‌గా ఈ దృశ్యాలు చూస్తే గుండె ఆగిపోతుంది. పాత సినిమాల్లో ఇలాంటి దృశ్యాలు కనబడుతాయి. ఇక్కడ కూడా సేమ్ అలాంటి సీన్ రిపీటైంది. మట్టితో తయారు చేసిన రెండు బొమ్మలను తయారు చేశారు. గతంలో ఈ బొమ్మలకు కుంకుమ చల్లారు. వస్త్రాలతో అలంకరించారు. ఎటు చూసినా నిమ్మకాయలు, పసుపుతో మొత్తం నింపారు. చెట్టుకు పూర్తిగా పసుపును పూశారు. గాజులు, రెండు మట్టి పాత్రలు పెట్టారు. కొన్ని రోజుల క్రితం అర్థరాత్రి ఈ తతంగాన్ని కొనసాగించారు.

అంతేకాకుండా మేకలను, కోళ్లను బలి ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు. అయితే గుప్త నిధుల తవ్వకానికి ముందు ఏమైనా నిధి లభిస్తే.. ఎలాంటి పూజల చేస్తారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో నిరంతరం ఈ విధంగా క్షుద్ర పూజలు చేస్తున్నారు. చాలా భయంకరంగా కనబడుతున్నాయి ఈ దృశ్యాలు. రెండు, మూడు రోజుల పాటు.. ఇలాంటి పూజలు చేస్తున్నారు. ఈ దృశ్యాలు గొర్రెల కాపరి చూశాడు. ఈ ప్రాంతానికి రైతులు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఒంటరిగా పొలాల దగ్గరికి వెళ్లలేకపోతున్నారు. వర్షం కురిస్తే అప్పుడప్పుడూ నాణెలు కొట్టుకొస్తున్నాయి. గతంలోనే నిధి దొరకడంతోనే మళ్లీ నిధి కోసం తవ్వకాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు పలు వస్తువులు లభించడంతో ఖచ్చితంగా బంగారం ఉందని బలంగా నమ్ముతున్నారు.

అయితే ఈ పూజలు చూసి జనం భయపడుతున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో పూజలు పెరిగిపోయాయి. మొత్తానికి బంగారం కోసం గుప్త నిధుల ముఠా తీవ్రమైన అన్వేషణ మొదలు పెట్టింది. ఈ ముఠా ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు. కానీ వారానికి రెండు సార్లు ఇలాంటి పూజలు చేస్తున్నారు. బంగారం కోసం ఇలాంటి పూజలు నిత్యం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. తరుచూ ఈ గుట్ట ప్రాంతంలో ముఠా సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు. నిత్యం తవ్వకాలు చేస్తునే ఉన్నారని తెలుపుతున్నారు. మేకలను. కోళ్లను బలి ఇస్తున్నారని అంటున్నారు. ఈ ముఠా రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రంగనాయకుల గుట్ట ప్రాంతంలో కాకతీయులు పాలన సాగించారని సోషల్ సబ్జెక్ట్ ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాకతీయులు ఎక్కడ పాలన సాగించినా బంగారం దాచి పెట్టేవారని తెలుపుతున్నారు. ఇక్కడ బంగారం ఉందని తవ్వకాలు చేస్తున్నారని అంటున్నారు.