హన్మకొండలో వీహెచ్‌ బైఠాయింపుతో ఉద్రిక్తత.. ఆ విగ్రహం తొలగించిన చోటే ప్రతిష్టించాలని డిమాండ్‌

|

Feb 02, 2021 | 2:30 PM

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు వరంగల్‌లో నిరసన ధర్నా చేపట్టారు. రహదారిపై ఉన్న గాంధీ విగ్రహాన్ని..

హన్మకొండలో వీహెచ్‌ బైఠాయింపుతో ఉద్రిక్తత.. ఆ విగ్రహం తొలగించిన చోటే ప్రతిష్టించాలని డిమాండ్‌
Follow us on

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు వరంగల్‌లో నిరసన ధర్నా చేపట్టారు. రహదారిపై ఉన్న గాంధీ విగ్రహాన్ని మూడురోజుల క్రితం మున్సిపల్‌ అధికారులు తొలగిండం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు.

వీహెచ్‌ ధర్నాతో దీంతో హన్మకొండలోని టీవీ టవర్ చౌరస్తాలో ఉద్రిక్తత నెలకొంది. గాంధీ విగ్రహాన్ని తొలగించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విగ్రహం తొలగించిన చోటే బైఠాయించారు. వీహెచ్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ కార్యకర్తలు, గాంధీ అభిమానులు ధర్నా వద్దకు భారీగా చేరుకున్నారు.

ఇప్పటికే ఓరుగల్లులో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఉద్రిక్తత నెలకొంది. రామ మందిరం విరాళాలపై చోటుచేసుకున్న ఘర్షణ దాడులు, ప్రతిదాడుల వరకు వెళ్లింది. పలువురిపై కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో గాంధీ విగ్రహం తొలగించడం వరంగల్‌లో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలకు మరింద ఆజ్యం పోసినట్లైందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.