Etela Quits TRS: టీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా.. పదవులు త్రుణప్రాయ‌మంటూ ఘాటు వ్యాఖ్య‌లు

అందరూ ఊహించినట్లుగానే టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. రాత్రికి రాత్రే తనను మంత్రివర్గం నుంచి....

Etela Quits TRS: టీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా.. పదవులు త్రుణప్రాయ‌మంటూ ఘాటు వ్యాఖ్య‌లు
Eetela Resigns Trs

Updated on: Jun 04, 2021 | 11:50 AM

అందరూ ఊహించినట్లుగానే టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. రాత్రికి రాత్రే తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారని, కానీ త‌న‌కు అలాంటి అవకాశం కూడా ఇవ్వలేదని ఈటల అన్నారు. ఓ అనామకుడు లేఖ రాస్తే మంత్రి మీద విచారణ చేస్తారా? అని ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా చర్యలు తీసుకున్నారన్నారు. కనీసం తాన వివరణ కూడా అడగలేదన్నారు. హుజురాబాద్‌లో ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించుకున్నామని ఈటల చెప్పుకొచ్చారు.

“ప్రాణం ఉండగానే నన్ను బొందపెట్టాలని ఆదేశాలిచ్చారు. నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హుజూరాబాద్‌ ప్రజలు చెప్పారు. పదవుల కోసం నేను ఏనాడూ పాకులాడలేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు రాజీనామా చేశా. అది ప్రగతిభవన్‌ కాదు.. బానిస భవన్” అంటూ ఈటల విమర్శలు గుప్పించారు.

తెలంగాణ ఉద్యమంలో ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్‌.. ఇప్పుడు డబ్బును, అణిచివేతను నమ్ముకున్నారని ఈటల విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి, తనకు ఐదేళ్ల నుంచే విబేధాలు నెలకొన్నాయని ఈటల రాజేందర్‌ వివరించారు. దళిత సీఎం సంగతి ఏమో గానీ సీఎంవోలో ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి ఐఏఎస్‌ అధికారులు ఒక్కరైనా ఉన్నారా? అని ఈటల ప్రశ్నించారు. తెలంగాణలో సమ్మెలు చేస్తే సమస్యలు పరిష్కారం కావని ఈటల అన్నారు. రైతుబంధును ఆదాయ పన్ను చెల్లించేవారికి ఇవ్వొద్దని చెప్పానని, వ్యవసాయం చేయనివారికి రైతుబంధు ఇస్తే ఉపయోగం ఉండదని చెప్పానని తెలిపారు. పొలం సాగు చేస్తున్న రైతులకు రైతుబంధు ఇస్తే బాగుంటుందని సలహా ఇస్తే పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనే స్థాయి రైస్ మిల్లర్లకు లేదని, రాదని అన్నారు.


Also Read: మంచిర్యాల జిల్లాలో అమానుషం.. క‌రోనా వ‌చ్చింద‌ని భార్య‌ను బాత్రూంలో బంధించిన భ‌ర్త

 కంటైన్మెంట్ జోన్‌గా కాళేశ్వ‌రం.. భ‌క్తుల‌కు నో ఎంట్రీ