Etela rajender: నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల రాజేందర్..

|

Jun 05, 2021 | 7:13 AM

Etela rajender resignation: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీతో తనకున్న

Etela rajender: నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల రాజేందర్..
Etela Rajender
Follow us on

Etela rajender resignation: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నట్లు రాజేందర్ ప్రకటించారు. దీంతోపాటు ఈ రోజు ఎమ్మెల్యే పదవికి సైతం ఈటల రాజేందర్ రాజీనామా చేయనున్నారు. అనంతరం ఆయన నేరుగా హుజూరాబాద్‌ వెళ్లి కార్యకర్తలతో చర్చించి కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈ రోజు రాజేందర్ స్పీకర్‌ను కలిసి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా లేఖను సమర్పించనున్నారు. అనంతరం భవిష్యత్తు కార్యచరణ, బీజేపీలో చేరే రోజుపై ఆయన స్పష్టత ఇవ్వనున్నారు.

శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల రాజేందర్.. పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నాకు ఎమ్మెల్యే, మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చినట్లుగా కొందరు నాయకులు పేర్కొంటున్నారని.. ఆ పదవులు ఇవ్వమని తానెప్పుడూ అడగలేదన్నారు. ఏ పదవి ఇచ్చినా సంపూర్ణంగా న్యాయం చేశానన్నారు. తనను ఎమ్మెల్యేగా ఎలా తొలగించాలా అని కొందరు ఆలోచన చేస్తున్నారని వారు తొలగించేలోగా తానే పదవిని వదులుకుంటానని ప్రకటించారు.

శుక్రవారం హైదరాబాద్‌ శివారు పూడూరులోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. ఎవరో రాసిన లేఖతో వెంటనే విచారణ ఎలా చేస్తారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. దీంతోపాటు వారం రోజుల్లో మంచిరోజు చూసుకుని బీజేపీలో చేరనున్నట్లు కూడా ఈటల పేర్కొన్నారు.

Also read:

Covid 19 Vaccine: కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకునేందుకు నిరాకరించారని కరెంట్ కట్ చేసిన అధికారులు.. గ్రామస్తులు ఏమంటున్నారంటే..