Etela Rajender: హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈటల రాజేందర్ రాజకీయ భేటీ.. ఆ ఇద్దరితోనేనా చర్చలు.. లేదా..

|

May 25, 2023 | 9:35 PM

గురువారం ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్ చేరుకున్న ఈటల రాజేందర్.. తన వాహనాన్ని, వ్యక్తిగత సిబ్బందిని, గన్ మెన్లను తిరిగి పంపించేశారు. అక్కడ నుంచి ఇతరుల వాహనంలో ఈటల రాజేందర్.. నగర శివారులోని ఓ ఫార్మ్ హౌజ్ కు వెళ్లారు.

Etela Rajender: హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈటల రాజేందర్ రాజకీయ భేటీ.. ఆ ఇద్దరితోనేనా చర్చలు.. లేదా..
Etela Rajender
Follow us on

బీజేపీ ఎమ్మెల్యే, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సడెన్‌గా ఎటో వెళ్లారు. ఈరోజు అందుబాటులో ఉండనంటూ ముందు రోజే కార్యకర్తలకు సమాచారం పంపారు. గురువారం ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్ చేరుకున్న ఈటల రాజేందర్.. తన వాహనాన్ని, వ్యక్తిగత సిబ్బందిని, గన్ మెన్లను తిరిగి పంపించేశారు. అక్కడ నుంచి ఇతరుల వాహనంలో ఈటల రాజేందర్.. నగర శివారులోని ఓ ఫార్మ్ హౌజ్ కు వెళ్లారు. అక్కడ ఇద్దరు కీలక నేతలతో సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఇటీవల ఈటల రాజేందర్ హస్తినకు వెళ్లి వచ్చారు. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో వన్‌ టు వన్ సమావేశం అయ్యారు. ఆ తర్వాత పార్టీ ఇన్ సైడ్ యాక్టివిటీ వేగం పెంచారు.

చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్ గతంలో ఖమ్మం వెళ్లి.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లితో జరిపిన చర్చలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. గతంలో మీడియాకు సమాచారం ఇచ్చి ఖమ్మం వెళ్లిన ఈటల రాజేందర్.. ఈ సారి గప్‌చుప్‌గా వారితోనే రెండో దశ చర్చలు జరిపారా ? లేక వేరే ఇంకేవరితోనైనా సమాలోచనలు చేశారా .. ? ఎన్నికల దగ్గర పడటంతో ఆపరేషన్ ఆకర్ష్‌ను ముమ్మరం చేసింది కమలదళం. హైకమాండ్ ఇచ్చిన హామీ మేరకు పొంగులేటి, జూపల్లికి భరోసా ఇవ్వడానికే.. ఈటల ఆ ఇద్దరితో రహస్య చర్చలు జరిపారనే ప్రచారం జరుగుతోంది.

ఈటల రాజేందర్.. రహస్య చర్చలు ఏ మేరకు ఫలించాయి ? చర్చలకు వచ్చిన నేతలు పొంగులేటి, జూపల్లేనా ? లేక అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఎవరైనా వచ్చారా? ఈటల ఆపరేషన్ ఆకర్ష్ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ? ప్రస్తుతానికి ఇవి ప్రశ్నలే. ఇక్కడే మరో చర్చ కూడా నడుస్తోంది. ఈ టైమ్‌లో ఈటల సీక్రెట్ మీటింగ్స్ కేవలం జాయినింగ్స్‌కు సంబంధించేనా? లేక తెరవెనుక ఏదైనా జరుగుతోందా అన్న ప్రశ్న కూడా వస్తోంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం