Etela Rajender: భూకబ్జా ఆరోపణలు.. హైకోర్టును ఆశ్రయించిన జమునా హాచరీస్.. ఇవాళ విచారణకు వచ్చే అవకాశం..

|

May 04, 2021 | 10:26 AM

Etela Rajender: భూ ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ కుటుంబానికి చెందిన జమునా హాచరీస్..

Etela Rajender: భూకబ్జా ఆరోపణలు.. హైకోర్టును ఆశ్రయించిన జమునా హాచరీస్.. ఇవాళ విచారణకు వచ్చే అవకాశం..
Jamuna Hatcharies
Follow us on

Etela Rajender: భూ ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ కుటుంబానికి చెందిన జమునా హాచరీస్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలుు చేసింది. భూ కబ్జా వ్యవహారంలో మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందంటూ పిటిషన్‌లో ఆరోపించారు. అంతేకాదు.. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా జమునా హాచరీస్‌లోకి ప్రవేశించి విచారణ చేశారని, తమ అనుమతి లేకుండా హాచరీస్‌లోకి ప్రవేశించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. అచ్చంపేటలో తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారని, ఇది చట్ట విరుద్ధం అని పిటిషన్‌లో పేర్కొన్నారు. జమునా హాచరీస్ దాఖలు చేసిన ఈ పిటిషన్ మంగళవారం నాడు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలాఉంటే.. అచ్చంపేట ప్రాంతంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు జమునా హాచరీస్ 60 ఎకరాలకు పైగా భూమి కబ్జా చేసినట్లు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిని కబ్జా చేశారంటూ పలువురు రైతులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేఖలు కూడా రాశారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించగా.. భూకబ్జాను ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే అధికారులను విచారణకు ఆదేశించారు. మెదక్ జిల్లా కలెక్టర్ చే నివేదిక తెప్పించుకున్నారు. భూ కబ్జా నిజమని అధికారులు తేల్చిన వెంటనే.. ఈటల రాజేందర్‌కు కేటాయించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖను తొలగించి ముఖ్యమంత్రి తీసేసుకున్నారు. అది జరిగిన కొన్ని గంటలు గడిచిన కాసేపటికే.. ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.

ఇదిలాఉంటే.. ఈటల రాజేందర్ కూడా తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. సమయం వచ్చినప్పుడు అన్నీ వెల్లడిస్తానని ప్రకటించారు. కుట్రపూరితంగా తనపై లేనిపోని ఆరోపణలు చేసి అవమానానికి గురిచేశారని ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు.

Also read:

అమెరికా నుంచి ఇండియాకు ‘కోవిడ్ సహాయక’ విమానాల రాకలో జాప్యం, ఎందుకంటే ?

Corona Positive: దేశంలోనే మొదటిసారిగా నెహ్రూ జూ పార్క్ లోని ఎనిమిది సింహాలకు కరోనా పాజిటివ్!