Telangana: తెలంగాణ‌లో ప‌లు ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పెంపు.. ఇవిగో వివ‌రాలు

|

Jun 16, 2021 | 9:16 AM

కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో తెలంగాణ‌లో పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పొడిగించారు. ఎల్ఎల్​బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ఎంట్ర‌న్స్ కోసం నిర్వహించే....

Telangana: తెలంగాణ‌లో ప‌లు  ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పెంపు.. ఇవిగో వివ‌రాలు
Student Alerts
Follow us on

కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో తెలంగాణ‌లో పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పొడిగించారు. ఎల్ఎల్​బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ఎంట్ర‌న్స్ కోసం నిర్వహించే లాసెట్, పీజీ ఎల్​సెట్​కు ఆలస్య రుసుము లేకుండా ఈనెల 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చునని కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. బీఈడీ ప్రవేశాల కోసం ఆలస్య రుసుము లేకుండా ఈనెల 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కన్వీనర్ ఎ.రామకృష్ణ తెలిపారు. వ్యాయామ విద్య కోర్సులు బీపెడ్, డీపెడ్ ప్రవేశాల పరీక్ష పీఈసెట్ దరఖాస్తుల గడువు ఈనెల 30 వరకు పొడిగించినట్లు కన్వీనర్ సత్యనారాయణ వెల్ల‌డించారు. ఇప్పటి వరకు బీపెడ్ కోసం 1487, డీపెడ్​కు 1062 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు.

క్లాట్ పరీక్ష తేదీ ఖరారు..

జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల ఎన్‌ఎల్‌యుల కన్సార్టియం కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్ పరీక్ష తేదీ) తేదీని ప్రకటించింది. క్లాట్ 2021 పరీక్ష జూలై 23 న నిర్వహించబడుతుంది. గ్రాడ్యుయేట్ (యుజి), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పిజి) కార్యక్రమాలకు ప్రవేశ పరీక్షను మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు. CLAT అనేది దేశంలోని 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు అందించే UG, PG న్యాయ కోర్సులలో ప్రవేశానికి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. అన్ని COVID ప్రోటోకాల్‌లను అనుసరించి CLAT 2021 ని సెంటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తామని కన్సార్టియం ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read: వైద్యశాఖలో కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకానికి తెలంగాణ స‌ర్కార్ గ్రీన్‌సిగ్న‌ల్

 భార్య‌తోనే ఉంటా.. మైన‌ర్ బాలుడి మారాం.. చివ‌రకు కోర్టు ఏం చెప్పిందంటే..