విషాదాన్ని మిగిల్చిన విహారయాత్ర.. అలా మృత్యువులోకి జారుకున్న యువకుడు..

| Edited By: Srikar T

Jul 23, 2024 | 7:21 PM

జలపాతాల వద్ద ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కొందరి నిర్లక్ష్యం నిండు ప్రాణాలు బలి తీసుకుంటుంది. తాజాగా బొగత జలపాతాల వద్ద ఓ యువకుడు మృతి చెందాడు. మహోగ్రరూపం దాల్చిన జలపాతం వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుల విహారయాత్ర ఊహించని విషాదాన్ని మిగిల్చింది. మృతుడు వరంగల్‎లోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన జశ్వంత్ గా గుర్తించారు. ఓ ప్రయివేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు జశ్వంత్. తన స్నేహితులతో కలిసి సరదాగా బొగత జలపాతాల సందర్శనకు వెళ్ళాడు.

విషాదాన్ని మిగిల్చిన విహారయాత్ర.. అలా మృత్యువులోకి జారుకున్న యువకుడు..
Water Falls
Follow us on

జలపాతాల వద్ద ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కొందరి నిర్లక్ష్యం నిండు ప్రాణాలు బలి తీసుకుంటుంది. తాజాగా బొగత జలపాతాల వద్ద ఓ యువకుడు మృతి చెందాడు. మహోగ్రరూపం దాల్చిన జలపాతం వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుల విహారయాత్ర ఊహించని విషాదాన్ని మిగిల్చింది. మృతుడు వరంగల్‎లోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన జశ్వంత్ గా గుర్తించారు. ఓ ప్రయివేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు జశ్వంత్. తన స్నేహితులతో కలిసి సరదాగా బొగత జలపాతాల సందర్శనకు వెళ్ళాడు. జలపాతాలు వీక్షించిన అనంతరం అక్కడ ఫోటోలు దిగారు. అనంతరం జశ్వంత్ జలపాతాల వరద లోతు గమనించకుండా అందులోకి దిగాడు. ఈ క్రమంలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

కళ్ళముందే అంతా చూస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. వరదల్లో చిక్కుకొని అతని నిండు ప్రాణాలు కోల్పోయాడు. అతను వరదల్లో కొట్టుకుపోతుంటే గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అందులోకి దూకి కాపాడే ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే జశ్వంత్ ప్రాణాలు కోల్పోయాడు. అక్కడ నుండి బయటకు తీసి వెంకటాపురం ఏరియా ఆసుపత్రి మార్చుకు తరలించారు పోలీసులు. జలపాతాలు అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తున్నా అటవీశాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు పర్యాటకులు. కేవలం ఆదాయం కోసమే అక్కడికి సందర్శకులను అనుమతిస్తుందని ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ వైఫల్యం వల్లే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు చెబుతున్నారు. ఆ విద్యార్థుల విహారయాత్ర ఊహించని విషాదాన్ని మిగిల్చడంతో మృతుడి కుటుంబసభ్యులతోపాటూ అతని స్నేహితులు బోరున విలపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..