Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Fraud Case: డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లకు ఈడీ బిగ్‌ షాక్‌.. మనీలాండరింగ్ కేసులో వెంకట్రామిరెడ్డితో పాటు మరో ఇద్దరు అరెస్ట్‌

ED Arrest: మనీ లాండరింగ్ కేసులో విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో వెంకట్రామ్ రెడ్డి సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఈ ముగ్గుర్నీ కాసేపట్లో ఈడీ కోర్టులో హాజరుపరచనుంది. 8వేల కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ అభియోగాలు మోపింది. హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరులో డెక్కన్ క్రానికల్‌కు..

Bank Fraud Case: డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లకు ఈడీ బిగ్‌ షాక్‌.. మనీలాండరింగ్ కేసులో వెంకట్రామిరెడ్డితో పాటు మరో ఇద్దరు అరెస్ట్‌
Deccan Chronicle Md Venkat Ram Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 14, 2023 | 9:22 AM

హైదరాబాద్, జూన్ 14: డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లకు ఈడీ బిగ్‌ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో వెంకట్రామ్ రెడ్డి సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఈ ముగ్గుర్నీ కాసేపట్లో ఈడీ కోర్టులో హాజరుపరచనుంది. 8వేల కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ అభియోగాలు మోపింది. హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరులో డెక్కన్ క్రానికల్‌కు చెందిన 363 కోట్ల రూపాయల విలువ చేసే 14 ఆస్తుల్ని అటాచ్ చేసింది. అలాగే డెక్కన్ క్రానికల్ స్కామ్ పై ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది ఈడీ. వెంకట్రామిరెడ్డి అప్పుల పర్వం 2005లో మొదలైంది. ఆ తర్వాత 2009-11 మధ్య వందల కోట్ల రూపాయలు వేర్వేరు బ్యాంకుల నుంచి ఆయన సంస్థ డీసీహెచ్‌ఎల్‌ అప్పులు చేసింది.

అయితే వెంకట్రామిరెడ్డి తమను మోసగించారంటూ 2013లో కెనరా బ్యాంక్‌ సీబీఐకి ఫిర్యాదు చేసింది. వేర్వేరు బ్యాంకుల్లో ఒకే ఆస్తిని తనఖా పెట్టినట్టు ఫిర్యాదులో వివరించింది. కెనరా బ్యాంక్‌ కేసు ఫిర్యాదుతో.. రుణాలు సొంతానికి వాడుకున్నారని సీబీఐ కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేసింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కూడా ఎంటర్‌ అయింది. గతంలో 3,300 కోట్లకుపైగా వెంకట్రామిరెడ్డి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ… పెద్ద మొత్తంలో రుణాలు దారి మళ్లించినట్లు అభియోగాలు మోపింది.

అయితే మొదట్లో విచారణకు హాజరైన వెంకట్రామి రెడ్డి అండ్‌ కో ఆ తర్వాత విచారణకు డుమ్మా కొట్టింది. ఈ క్రమంలోనే మరోసారి విచారణకు పిలిచింది. విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో వెంకట్రామిరెడ్డితో పాటు పీకే అయ్యర్‌, మని ఓమెన్‌లను అరెస్ట్ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

మనసు మార్చుకున్న జక్కన్న.. మహేష్ మూవీ ఆలా రావటం లేదా.?
మనసు మార్చుకున్న జక్కన్న.. మహేష్ మూవీ ఆలా రావటం లేదా.?
225 మంది ప్రయాణికులతో గాల్లో విమానం. మరికొద్దిక్షణాల్లో పేలుతుంది
225 మంది ప్రయాణికులతో గాల్లో విమానం. మరికొద్దిక్షణాల్లో పేలుతుంది
రైలు మధ్యలో AC కోచ్‌లను ఎందుకు ఏర్పాటు చేస్తారు? కారణం ఇదే!
రైలు మధ్యలో AC కోచ్‌లను ఎందుకు ఏర్పాటు చేస్తారు? కారణం ఇదే!
సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కు వెల్లువెత్తుతున్న విషెస్..
సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కు వెల్లువెత్తుతున్న విషెస్..
ఆ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి అమ్మవారి ముందు ప్రతిరోజు విచిత్ర ఘటన
ఆ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి అమ్మవారి ముందు ప్రతిరోజు విచిత్ర ఘటన
హజ్ యాత్ర వేళ భారత్ సహా 14 దేశాలకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా..
హజ్ యాత్ర వేళ భారత్ సహా 14 దేశాలకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా..
కోహ్లీ, బుమ్రా మధ్య ఫన్నీ రన్‌ఔట్ డ్రామా వైరల్!
కోహ్లీ, బుమ్రా మధ్య ఫన్నీ రన్‌ఔట్ డ్రామా వైరల్!
నిందితురాలు ముస్కాన్‌ రస్తోగి గర్భం దాల్చినట్లు నిర్ధారణ
నిందితురాలు ముస్కాన్‌ రస్తోగి గర్భం దాల్చినట్లు నిర్ధారణ
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు భారీ ప్రమాదం..!రెండు ముక్కలుగా విడిపోయి
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు భారీ ప్రమాదం..!రెండు ముక్కలుగా విడిపోయి
నా బట్టలు నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.
నా బట్టలు నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.