Encounter: ములుగు అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి..

Encounter in Mulugu forest: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం కాల్పులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రేహౌండ్స్ దళాలు-మావోయిస్టులు మధ్య

Encounter: ములుగు అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి..
Encounter

Updated on: Jan 18, 2022 | 11:05 AM

Encounter in Mulugu forest: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం కాల్పులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రేహౌండ్స్ దళాలు-మావోయిస్టులు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మృతిచెందారు. దీంతోపాటు ఓ జవాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్ ములుగుజిల్లా (Mulugu District) వెంకటాపురం మండలంలోని కర్రిగుట్టల వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు. కర్రిగుట్టల వద్ద గ్రెహౌండ్స్ దళాలు జల్లెడపడుతున్న క్రమంలో.. మావోలు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు (Maoists) మరణించారని ములుగు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో ఒక జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ పోలీసులు, గ్రెహౌండ్స్ దళాలు ఈ ఆపరేషన్‌‌ను సంయుక్తంగా నిర్వహించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

Also Read:

AP Crime: పెళ్లైన నెలకే పుట్టింటికి వెళ్లిన భార్య.. చివరకు భర్త ఏం చేశాడంటే..

Road Accident: గుంటూరు జిల్లాలో విషాదం.. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి దుర్మరణం..