CM KCR announcement : రెండు మూడు రోజుల్లో ఉద్యోగుల సమస్యలపై ప్రకటన చేస్తా.. అని గురువారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఉద్యోగుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మరో బంపరాఫర్ సీఎం ప్రకటిస్తారని ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ అన్ని సమస్యలకు పరిష్కారం ఇస్తారా లేదా పీఆర్సీ పై మాత్రమే ప్రకటన చేస్తారా అనేది సర్కారీ వేతన జీవుల్లో సస్పెన్స్ గా మారింది. కానీ ఎమ్మెల్సీ ఫలితాలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటే మాత్రం కేసీఆర్.. పీఆర్సీ తో పాటు ఉద్యోగుల వయోపరిమితి పెంపు, మరో 50వేల ఉద్యోగాల భర్తీపై కూడా ప్రకటన చేస్తారని ఉద్యోగ సంఘాలు నేతల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు, నాగార్జునసాగర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఈ నెల 23న రాబోతుంది. ఇప్పటికే షెడ్యూల్ రావడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలయింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, పీఆర్సీ పై గంపెడాశలు పెట్టుకున్న ఎంప్లాయిస్ కి గ్రాడ్యుటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలు గండి కొట్టాయి. అయితే తాజాగా ఇప్పుడు మళ్లీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు నగారా మోగడం, 23వ తేదీ నుండి మళ్ళీ కోడ్ అమలులోకి రానుండటం ఉద్యోగులంతా అసెంబ్లీ వైపు చూస్తున్నారు.
అటూ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల గురించే కాకుండా, పాఠశాలలు నడపడంతో పాటు మిగితా విషయాల్లో కూడా కీలక నిర్ణయాలు అసెంబ్లీ వేదికగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకం కానున్నాయా…? అనేది సోమవారం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తోంది.
Read also : Swimmer Smt G. Syamala : 47 ఏళ్ల వయసులో 30 కి.మీ మేర సముద్రాన్ని విజయవంతంగా ఈదిన హైదరాబాద్ మహిళ