పెళ్లంటే వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, ఇళ్లంతా బంధువులు, చుట్టాల హడావుడి..ఇక ప్రేమ పెళ్లిలో మాత్రం ఇవేవీ కనిపించవు..కొందరు లవర్స్ సంతకాల పెళ్లి చేసుకుంటే.. మరికొందరు ప్రేమికులు గుడిలోనో, ఆర్యసమాజ్ లోనో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైపోతారు..అయితే, ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రేమ జంట పెళ్లిలాంటిది మాత్రం గతంలో ఎప్పుడూ చూసిఉండరు.
అతనొక ప్రజాప్రతినిధి.. పేరు రవి నాయక్….అతని పుట్టిన రోజు సందర్బంగా ఓ శుభకార్యానికి పూనుకున్నారు. ఓ ప్రేమజంటకు పెళ్లి జరిపించి చిరకాలం గుర్తుండి పోయేలా చేశారు. ఎవరైనా పుట్టినరోజు అంటే.. ఖరీదైన కానుకలు ఇస్తారు….కానీ ఇతడు మాత్రం వారిద్దరినీ ఏకం చేసి దాంపత్య జీవితం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు మిత్రులు వీరి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అందరూ కలిసి కేసముద్రం మండలం తాళ్ళపూసపల్లిలోని ఓ గుడికి చేరుకున్నారు. పెళ్లికి కావాల్సిన మంగళ సూత్రం, పూల దండలు అన్ని సమకూర్చారు. పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతుంది. అక్కడ అంతా హడావుడి తీరా…ముహూర్తం దగ్గర పడే సమయానికి పెళ్లి తతంగం నడిపించే పురోహితుడినే మరచిపోయారు.
దీంతో, ఒకరి మొఖాలు ఒకరు చూసుకోవాల్సి వచ్చింది. చేసేది లేక, తెలిసిన అయ్యగారి కి ఫోన్ చేసి పెళ్ళి మంత్రాలు చదవాల్సిందిగా కోరారు. ఖంగుతిన్న అయ్యగారు పోనీలే పాపమంటూ తన తంతును ప్రారంభించారు. స్మార్ట్ మొబైల్ లో వీడియోలో మంత్రాలు చదువుతుంటే..ఇక్కడ ఇలా వధువు మెడలో మూడుముళ్లు వేశాడు వరుడు.
ఇదేదో బాగుందని మిత్రులు… పెళ్ళి చేసుకుంటున్న జంట భలే ముచ్చట పడ్డారు. భాజాబజంత్రీలు లేకపోవడంతో గుడి గంటలే వారి పెళ్ళికి మేళతాళాలయ్యాయి. అయ్యగారి మంత్రాలకు మిత్రులంతా తోడై అక్షింతలు వేసి వారిని ఆశీర్వదించారు.
ఇంకెందుకు ఆలస్యం పనిలో పనిగా మనం కూడా ఈ నూతన జంటను ఆశీర్వదిద్దాం…..మొబైల్ ఫోన్ లో.
……ఇక రాబోయే రోజుల్లో పెళ్లిళ్లు ఈ విధంగానే జరుగుతాయి కాబోలు……
Also Read: