“అదిగో లచ్చిందేవి.. ఇదిగో లచ్చిందేవి” అన్నారు.. మహిళ దగ్గర 21 లక్షలు దోచుకుని వెళ్లిపోయారు

తెలంగాణలోని  నిర్మల్ జిల్లా కడెం పెద్దుర్లో గుప్త నిధుల పేరుతో చేసిన మోసం కలకలం రేపింది. పెద్దూరుకు చెందిన ఓ మహిళ గుప్త నిధుల వేటలో మోసపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అదిగో లచ్చిందేవి.. ఇదిగో లచ్చిందేవి అన్నారు.. మహిళ దగ్గర 21 లక్షలు దోచుకుని వెళ్లిపోయారు
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 06, 2021 | 11:37 AM

తెలంగాణలోని  నిర్మల్ జిల్లా కడెం పెద్దుర్‌లో గుప్త నిధుల పేరుతో చేసిన మోసం కలకలం రేపింది. పెద్దూరుకు చెందిన ఓ మహిళ గుప్త నిధుల వేటలో మోసపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల బాధిత మహిళ కడెం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కడెం పెద్ధుర్ గ్రామంలో ఇటీవలే గ్రామానికి వచ్చిన కోయ పూజారుల మాటలు నమ్మి  ఓ మహిళ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పడంతో గుప్త నిధులు తవ్వకాలు జరిపినట్లు సమాచారం. తవ్వకాల్లో దేవుని ప్రతిమ ఇత్తడి బిందె బంగారం లభించినట్లు దానిని వారం రోజుల పాటు ఊరు బయట పూజలు నిర్వహించి విప్పితే ఆ మొత్తం మీకు దక్కుతుందని చెప్పి తనను మోసం చేసారని సదరు మహిళ ఆరోపిస్తోంది. జన్నారం మంచిర్యాల మేడారంకు చెందిన ముగ్గురు కోయ పూజారులు  21 లక్షలు పట్టుకెల్లి మోసం చేశారని మహిళ పేర్కొంది.

దీనిపై పోలీసులను వివరణ కోరగా.. గత నెల 26న పెద్దూరు గ్రామం చెందిన మహిళ కోయ పూజారులకు తన ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని చెప్పడంతో వాయిదా పద్ధతులలో 21 లక్షల వరకు ఇచ్చినట్లు మహిళ  కడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గుప్త నిధుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరుపుతున్నారు…ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు అనే విషయంపై విచారణ కొనసాగుతుంది. దీనిపై పోలీసులు పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంది.

కాగా ఇటీవలి కాలంలో ఇటువంటి మోసాలు భారీగా పెరిగిపోయాయి. గుప్త నిధులు, శని పూజలు, సోది చెప్పటాల పేరుతో సైలెంట్‌గా ఇళ్లలోకి ఎంట్రీ ఇస్తున్న కిలాడీ గ్యాంగ్‌లు జనాలను బురిడీ కొట్టిస్తున్నాడు. ముఖ్యంగా ఇంట్లో మగవాళ్లు లేని సమయాన్ని చూసి.. ఈ కిలాడీలు మహిళలకు మాయమాటలు చెప్పి దోచుకెళ్తున్నారు. తరుచూ ఏదో ఒక ప్రాంతంలో ఇటువంటి ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. ఈ తరహా మోసాలపై ఇరు రాష్ట్రాలలోని పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

Also Read:

ఈ పంట వేస్తే.. సిరుల పంట.. 1 ఎకరంలో సాగు చేస్తే 30 కోట్లు… సాగు విధానం సహా పూర్తి వివరాలు

నేడు సీతమ్మతల్లి జయంతి.. శుభ ముహూర్తం, ప్రాముఖ్యత.. పూర్తి వివరాలు..!

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!