Jamuna Hatcheries Lands: ఈట‌ల భూక‌బ్జా వాస్తవమే.. సంచలన విషయాలు వెల్లడించిన కలెక్టర్..

|

Dec 06, 2021 | 1:58 PM

Jamuna Hatcheries: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా కేసులో సంచలన విషయాలు వెల్లడించారు మెదక్ జిల్లా కలెక్టర్. భూకబ్జా వాస్తవమేనని ప్రకటించారు.

Jamuna Hatcheries Lands: ఈట‌ల భూక‌బ్జా వాస్తవమే.. సంచలన విషయాలు వెల్లడించిన కలెక్టర్..
Medak Collector
Follow us on

Jamuna Hatcheries: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా కేసులో సంచలన విషయాలు వెల్లడించారు మెదక్ జిల్లా కలెక్టర్. భూకబ్జా వాస్తవమేనని ప్రకటించారు. ఈటల భూకబ్జా వ్యవహారంపై సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్. మాసాయిపేట మండ‌లం అచ్చంపేట‌, హ‌కీంపేట్ ప‌రిధిలో అసైన్డ్ భూముల‌ను జ‌మునా హ్యాచ‌రీస్ క‌బ్జా చేసిందని స్పష్టం చేశారు. 70.33 ఎక‌రాల భూమిని జమునా హ్యాచరీస్ క‌బ్జా చేసిన‌ట్లు రెవెన్యూ అధికారుల స‌ర్వేలో తేలింద‌ని వెల్లడించారు. ఈ మేరకు మెదక్‌ కలెక్టర్‌ హరీష్‌ ఆధ్వర్యంలో సర్వే జరిపిన కమిటీ.. అచ్చంపేట, హకీంపేట పరిధిలో గల సర్వే నెంబర్‌ 77 నుంచి 82, 130, హకీంపేట శివారులో గల సర్వే నంబర్ 97, 111లో సీలింగ్ భూములు ఉన్నాయని తెల్చారు. అలాగే సర్వే నెంబర్ 78, 81, 130 లలో భారీ పౌల్ట్రీ షెడ్స్, ప్లాట్‌ఫామ్‌లు, రోడ్లను అనుమతి లేకుండానే నిర్మించారన్నారు. సర్వే నంబర్ 81లో 5 ఎకరాలు, 130 లో 3 ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తేల్చారు. మొత్తంగా 56 మంది అసైనీల భూములను కబ్జా చేసినట్లు తేలిందన్నారు. జమునా హ్యాచరీస్ భూకబ్జా, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక పంపామని కలెక్టర్ హరీశ్ తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై, అక్రమాలకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

కాగా, మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ వాసులు కొందరు.. తమ భూములను ఈటల రాజేందర్ ఆక్రమించాడంటూ ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాన్ని సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి.. ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు భూకబ్జాను తేల్చాలంటూ రెవెన్యూ, అటవీ, అవినీతి నిరోధక, విజిలెన్స్ శాఖలను ఆదేశించారు. సీలింగ్ భూములు, అసైన్డ్ భూముల ఆక్రమనను తేల్చేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీ అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో ఉన్న ఈటల రాజేందర్‌కు చెందిన జమునా హ్యాచరీస్ భూములను సర్వే చేశారు.

Also read:

Viral Video: సెన్షేషనల్ డ్యాన్స్‌తో హృదయాలను కొల్లగొడుతున్న చిన్నారి.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారంతే..

Elections – BJP: కేంద్ర కేబినెట్‌లో చోటు, భారీగా డబ్బు ఇస్తారట.. బీజేపీపై సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ..!

Walking house: నడిచే ఇల్లు.. ఇక వాటితో పని లేదంతే.. క్రియేటర్‌కు సలా కొట్టాల్సిందే..!