Telangana: ఎంబీఎస్, ముసద్దీలాల్‌లో తనిఖీలు.. 149 కోట్ల ఆభరణాలు, రూ. 1.96 కోట్ల నగదు సీజ్..

|

Oct 20, 2022 | 10:14 PM

ఎంబీఎసీ జ్యూవెలర్స్ అధినేత సుఖేష్ గుప్తా వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారిక ప్రకటన చేసింది. సుఖేష్‌ను అరెస్ట్ చేశామని..

Telangana: ఎంబీఎస్, ముసద్దీలాల్‌లో తనిఖీలు.. 149 కోట్ల ఆభరణాలు, రూ. 1.96 కోట్ల నగదు సీజ్..
Mmtc Limited
Follow us on

ఎంబీఎసీ జ్యూవెలర్స్ అధినేత సుఖేష్ గుప్తా వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారిక ప్రకటన చేసింది. సుఖేష్‌ను అరెస్ట్ చేశామని.. అతని షోరూంలలో రూ. 149 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.1.96 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. 2019 ఎంఎంటీఎస్‌లో బంగారం కొనుగోళ్లకు సంబంధించి ఈ సోదాలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరులో రెండ్రోజులు సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. 504 కోట్ల రూపాయలు రుణం తీసుకుని ఎగ్గొట్టారన్న ఆరోపణలపై సోదాలు జరిపినట్లు స్పష్టం చేసింది. గతంలోనే వన్ టైమ్ సెటిల్‌మెంట్ ఇచ్చి విఫలమయ్యారు సుఖేష్‌. ఆయనకు చెందిన ఎంబీఎస్, ముసద్దీలాల్‌లో తనిఖీలు పూర్తి చేశామని తెలిపింది. కేంద్రం ఆధీనంలో నడిచే ఎంఎంటీసీని సుఖేష్‌ గుప్తా పెద్ద మొత్తంలో ముంచారని ఈడీ అభియోగాలు మోపింది.

ఎంబీఎస్ సంస్థపై ఎంఎంటీసీ సంస్థ ఇచ్చిన పిర్యాదుతో ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సుఖేష్‌గుప్తాపై ఫెమా, పీఎంఎంఎల్ఏ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఎంఎంటీసీ సంస్థ నుండి 500 కోట్ల విలువైన బంగారాన్ని ఎంబీఎస్ సంస్థ కొనుగోలు చేసింది. క్రెడిట్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసింది. అయితే ఈ బంగారానికి సంబంధించి డబ్బులు MBS సంస్థ చెల్లించలేదు. MMTC ఇచ్చిన ఫిర్యాదుతో 2013లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 2014లో సీబీఐ అధికారులు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. 6 కేసుల్లో సుఖేష్‌గుప్తా మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. పెద్దనోట్లరద్దు సమయంలో సుఖేష్‌గుప్తా అక్రమాలకు పాల్పడినట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

మరోవైపు MBS జువెలర్స్‌ అధినేత సుఖేష్‌గుప్తాను కస్టడీ కోరుతూ కోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది. 14 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఐతే విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..