ED Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఎస్, ముసదీలాల్‌లో ఈడీ సోదాలు.. రెండ్రోజుల తనిఖీల్లో భారీగా బంగారం సీజ్..

ఒకటి రెండు కాదు.. వంద కోట్లకుపైగా బంగారం, వజ్రాలు సీజ్‌..!!! ఈడీ చరిత్రలోనే అతిపెద్ద గోల్డ్‌ సీజ్‌ అది..! రెండ్రోజులుగా ముసద్దిలాల్‌ జువెలర్స్‌లో జరిగిన సోదాల్లో బయటపడిన అక్రమాల బంగారు చిట్టా అది..!! వంద కోట్ల బంగారంతో పాటు.. మరో వంద కోట్ల బినామీ ఆస్తులు కూడా బయటపడ్డాయి. ముసద్దీలాల్ జ్యువెలరీస్‌ చేసిన ఆ బడా గోల్డ్‌ చీట్‌ ఏంటి?

ED Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఎస్, ముసదీలాల్‌లో ఈడీ సోదాలు.. రెండ్రోజుల తనిఖీల్లో భారీగా బంగారం సీజ్..
Musadddilal Jewellers
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 18, 2022 | 8:12 PM

ముసద్దీలాల్ జేమ్స్ ఆండ్ జువెల్స్ లో ఈడీ సోదాలు ముగిశాయి. రెండు రోజుల పాటు కొనసాగిన సోదాల్లో ఈడీ అధికారులు భారీ ఎత్తున బంగారం సీజ్ చేశారు. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్, సికింద్రాబాద్ తో పాటు విజయవాడలోని ముసద్దీలాల్ జువెల్లర్స్ లో దాదాపు 100 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలను సీజ్ చేశారు. వీటితో పాటు ఎంబీఎస్ జువెల్లర్స్ డెరైక్టర్లైన సుఖేష్ గుప్త, అనురాగ్ గుప్త బినామీలకు చెందిన 50కోట్ల ఆస్తులను సైతం జప్తు చేశారు. పదేళ్ల క్రితం ఎంబీఎస్ జువెల్లర్స్, దాని అనుబంధ సంస్థలు కలిసి ఎంఎంటీఎస్ నుంచి భారీగా బంగారాన్ని అరువుగా తీసుకున్నారు. బంగారు వ్యాపారులకు రాయితీ మీద బంగారాన్ని అమ్ముతుంది మెటల్స్ ఆండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పోరేషన్. ఈ కార్పోరేషన్ నుంచి ఎంబీఎస్ జువెల్లర్స్ 500కోట్లకు పైగా బంగారాన్ని తీసుకుంది.

దీనికి సంబంధించిన డబ్బు చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి ఎంఎంటీఎస్‌కి భారీగా బకాయిపడ్డారు ఎంబీఎస్‌ యజమానులు. ఎంబీఎస్‌కు వన్ టైం సెటిల్ మెంట్ అవకాశాన్నిచ్చింది ఎంఎంటీఎస్‌. దీన్ని కూడా ఉపయోగించుకోలేదు ముసద్దీలాల్ సంస్థ. దీంతో ఎంఎంటీఎస్‌ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు ఎంఎంటీఎస్‌ వర్సెస్ ఎంబీఎస్‌ కేసుకు సంబంధించి పలు అంశాలను వెలికి తీశారు. ఎంఎంటీఎస్‌లో పనిచేసే కొందరు అధికారులు ఎంబీఎస్‌ జువెల్లర్స్ డైరెక్టర్లకు అనుకూలంగా వ్యవహరించినట్టు గుర్తించారు.

డబ్బు ఇవ్వకున్నా భారీగా బంగారు ఇచ్చినట్లు కనుగొన్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంఎంటీఎస్‌ నుంచి తీసుకున్న బంగారం అమ్మకం ద్వారా వచ్చిన లాభాలతో ఎంబీఎస్‌ యజమానులు పలుచోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తమ పరిశోధనలో తేల్చారు. గతేడాది ఏప్రిల్ లో ఎంబీఎస్‌ జువెల్లర్స్ కు చెందిన 323 కోట్ల రూపాయలను జప్తు చేశారు.

దీంతో ఎంబీఎస్‌ డైరెక్టర్లైన సుఖేష్ గుప్త, అనురాగ్ గుప్త వేరే పేర్లమీద గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్లు ఐడెంటిఫై చేశారు. ఈ మేరకు ముసద్దీలాల్ జువెల్లర్స్ పై దాడులు నిర్వహించారు. సోదాల్లో స్వాధీనం చేస్కున్న పత్రాలు, బంగారు, వజ్రాభరణాలను కోఠిలోని ఎస్బీఐ ట్రెజరీలో డిపాజిట్ చేశారు ఈడీ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం