మొన్న లిక్కర్ స్కామ్‌లో లింకుల సెర్చింగ్, నిన్న గ్రానైట్ కంపెనీలపై అక్రమాల మైనింగ్, ఇవాళ పాత కేసు క్యాసినో ఇంటరాగేషన్. మొత్తంగా ఈడీ దూకుడు రోజుకోలా ఉంటోంది. హైదరాబాద్‌లోని శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో క్యాసినో నిర్వహించారన్న ఆరోపణలతో ఆర్గనైజర్ చికోటి ప్రవీణ్‌పై కేసు నమోదైంది. ఈయన కాల్ డేటా, ఇతర డాక్యుమెంట్స్ చూస్తే వందలాది మంది ప్రముఖులు ఆయన గ్రూప్స్‌లో ఉన్నట్లు తేలింది. ప్రవీణ్ శ్రీలంక, నేపాల్ వంటి దేశాలకు తీసుకెళ్లి క్యాసినో ఆడించేవారన్నది ఆరోపణ. వీటిపై విచారణ చేస్తున్న ఈడీ.. ఆయన లిస్ట్‌లో ఉన్న వాళ్లందరిపై ఆరా తీసింది. నేపాల్ వరకూ వెళ్లి క్యాసినో ఆడి వచ్చిన వాళ్లకు నోటీసులిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి వీళ్లంతా లక్షలు కోట్లు ఎలా తరలించారో, మనీలాండరింగ్ ఎలా జరిగిందన్నదానిపై కేసును ఉరుకులు పెట్టిస్తోంది ఈడీ.
అందులో భాగంగానే తలసాని బ్రదర్స్‌గా చెప్పే మహేష్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్‌కి నోటీసులు ఇచ్చి విచారించింది. ఇంటరాగేషన్ ఎదుర్కొన్న వాళ్లలో ఎల్ రమణ, డీసీసీబీ చైర్మన్ దేవందర్ రెడ్డి కూడా ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం