Dussehra Holidays 2025: రేపట్నుంచి ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు..

రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు దసరా సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. సెలవుల అనంతరం తిరిగి అక్టోబర్ 6న ఇంటర్ కాలేజీలు తెరుచుకొనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రకటన వెలువరించింది..

Dussehra Holidays 2025: రేపట్నుంచి ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు..
Telangana Inter Dussehra Holidays

Updated on: Sep 26, 2025 | 1:07 PM

హైదరాబాద్, సెప్టెంబర్‌ 26: తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఇప్పటికే దసరా సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని పాఠశాలల విద్యార్ధులు సొంతూళ్లకు చేరుకున్నారు. మొత్తం 13 రోజులు సెలవులు రావడంతో పిల్లల ఆనందానికి అవదులు లేకుండా ఉంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ తిరిగి పాఠశాలలు అక్టోబర్ 3వ తేదీన తెరచుకోనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలకు కూడా దసరా సెలవులు వచ్చాయి.

రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.  మొత్తంగా 9 రోజులు సెలవులు వచ్చాయి సెలవుల అనంతరం తిరిగి అక్టోబర్ 6న రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ కాలేజీలు తెరుచుకొనున్నాయి. సెలవుల్లో ప్రైవేటు కాలేజీలు క్లాసులు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్, యాజనమ్యం సెలవుల్లో క్లాసులు నిర్వహించే అఫిలియేషన్ క్యాన్సిల్ చేయవల్సి ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు స్కూళ్లతోపాటు జూనియర్ కాలేజీలకు కూడా 10 రోజులు సెలవులు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.