Drunk and Drive: మద్యం మత్తులో ఓ వ్యక్తి నానా హంగామా.. కారు పైకి ఎక్కి ఫోటోకి పోజులు.. పోలీసులతో గొడవ

హైదరాబాద్ పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి కార్ నడుపుతూ  భరత్ వజ్ అనే ఓ బిజినెస్ మెన్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో డ్రంకన్ డ్రైవ్ టెస్టు కోసం ప్రయత్నిస్తున్న పోలీస్ తో గొడవపడి హంగామా చేసాడు.

Drunk and Drive: మద్యం మత్తులో ఓ వ్యక్తి నానా హంగామా.. కారు పైకి ఎక్కి ఫోటోకి పోజులు.. పోలీసులతో గొడవ
Drunk And Drive In Hyderaba

Updated on: Apr 23, 2023 | 8:15 AM

పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. ఎంత చెప్పినా..  ఎన్ని ప్రమాదాలను చూస్తున్నా కొంతమంది యువతలో ఎటువంటి మార్పు రావడం లేదు. తాగడం .. తాగి వాహనం నడపడం మా హక్కు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఫుల్ గా తగిన ఓ వ్యాపార వేత్త పోలీసులతో గొడవ పడ్డాడు. నానా హంగామా చేశాడు. మద్యం మత్తులో కారు పైకి ఎక్కి ఫోటోలను పోజులు కూడా ఇచ్చాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి కార్ నడుపుతూ  భరత్ వజ్ అనే ఓ బిజినెస్ మెన్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో డ్రంకన్ డ్రైవ్ టెస్టు కోసం ప్రయత్నిస్తున్న పోలీస్ తో గొడవపడి హంగామా చేసాడు. చివరకి పంజా గుట్ట పోలీస్ లు సంఘటన స్థలానికి రావడంతో డ్రంకన్ డ్రైవ్ టెస్టుకి సహకరించాడు.

మద్యం మత్తులో ఉన్న భరత్ వజ్ కార్ పైన కూర్చొని ఫోటోలకు ఫోజులులిచాడు. అనంతరం అతడిని  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతూ పట్టుబడిన 20 మంది పై కేసు నమోదు చేశారు. 19 బైకులు, 1 కార్ ను పోలీసులు సీజ్ చేశారు. మద్యం సేవించి పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరుస్తామని ట్రాఫిక్ పోలీస్ లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అదేవిందంగా ఎస్.ఆర్.నగర్ ట్రాఫిక్ పోలీస్ లు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతూ పట్టుబడిన 9 మంది పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా 8 బైక్ లను 1 ఆటో ని ట్రాఫిక్ పోలీస్ లు సీజ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us