అందాల భామల రాకతో ఓరుగల్లులో మాయమైన వీధి కుక్కలు, కోతులు

వరంగల్‌లో వీధి కుక్కలు, కోతులను డాగ్స్ క్యాచర్స్ పరుగులు పెట్టిస్తున్నారు. వీధి కుక్క కనబడితే చాలు, పట్టి బంధిస్తున్నారు. నెట్స్ తో పట్టి వాహనాలలో తరలిస్తున్నారు. ఇంత హడావుడిగా వీధి కుక్కలను ఎందుకు పరుగులు పెట్టిస్తున్నారు..! ఎవరి భద్రత కోసం ఇంత హడావుడిగా శునకాలను బంధిస్తున్నారు..!

అందాల భామల రాకతో ఓరుగల్లులో మాయమైన వీధి కుక్కలు, కోతులు
Warangal

Edited By: Balaraju Goud

Updated on: May 14, 2025 | 1:29 PM

వరంగల్‌లో వీధి కుక్కలు, కోతులను డాగ్స్ క్యాచర్స్ పరుగులు పెట్టిస్తున్నారు. వీధి కుక్క కనబడితే చాలు, పట్టి బంధిస్తున్నారు. నెట్స్ తో పట్టి వాహనాలలో తరలిస్తున్నారు. ఇంత హడావుడిగా వీధి కుక్కలను ఎందుకు పరుగులు పెట్టిస్తున్నారు..! ఎవరి భద్రత కోసం ఇంత హడావుడిగా శునకాలను బంధిస్తున్నారు..! అన్న చర్చ మొదలైంది.

ప్రపంచ సుందరములు ఓరుగల్లు పర్యటన సందర్భంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. నగరమంతా నయా లుక్‌తో దగదగలాడుతుంది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు కొత్త అందాలతో వెలిగి పోతున్నాయి. నగరమంతా విద్యుత్ దీపాల కాంతులతో దగదగలాడుతోంది. వివిధ దేశాల నుండి ఓరుగల్లు అందాలను వీక్షించడం కోసం వస్తున్న అందాల భామలను మైమరిపించేలా ఏర్పాట్లు చేశారు.

అందమైన భామలను అబ్బుర పర్చడం కోసం చేస్తున్న ఏర్పాట్లు వీధి కుక్కలు, కోతుల పాలిట శాపమైంది. రోడ్డుపై కుక్క కనబడకుండా చేస్తున్నారు GWMC సిబ్బంది. వీధి కుక్కలు, కోతులను పరుగులు పెట్టిస్తున్నారు. అందాల భామలు వచ్చే మార్గంలో వీధి కుక్కలు కనబడకుండా వాటిని నెట్స్ తో పట్టి బోన్లలో బంధిస్తున్నారు .

సుందరీమణులు విడిది చేసే హరిత కాకతీయ హోటల్, వేయి స్తంభాల గుడి, ఖిలా వరంగల్ పరిసరాల్లో కనుచూపు మేరలో కుక్క కనబడకుండా చేస్తున్నారు. రోడ్లకు ఇరువైపుల చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించారు. మరోవైపు రామప్పలో కోతులు, వీధి కుక్కలను కంటికి కనిపించకుండా చేశారు. నెట్స్ తో వాటిని బంధించి వేరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. సుందరీమణులు ప్రశాంత వాతావరణంలో కాకతీయ వారసత్వ సంపదను తిలకించి మురిసిపోయేలా అదిరిపోయే ఏర్పాట్లు చేశారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..