Telangana: పోలీస్ సంస్మరణ దినోత్సవం ఎందుకు నిర్వహిస్తారో తెలుసా? అసలు కారణం ఇదే..

పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు మద్దతు ఇస్తున్నందుకు, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, ట్రైనింగ్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక విభాగాలలో పనిచేస్తున్న పోలీసులకు ప్రత్యేక అలవెన్స్‌లు ఆయా ప్రభుత్వాలు నుంచి పోలీసులకు అందుతూ ఉంటాయి. ఇక 2023 అక్టోబరు 21 నుంచి 31 వరకు తెలంగాణ లోని రాచకొండ కమిషనరేట్‌ వ్యాప్తంగా పోలీసు పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు, ఆన్‌లైన్‌ ఓపెన్‌ హౌస్‌, ఫోటోగ్రఫీ, షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు సీపీ చౌహన్ తెలిపారు.

Telangana: పోలీస్ సంస్మరణ దినోత్సవం ఎందుకు నిర్వహిస్తారో తెలుసా? అసలు కారణం ఇదే..
Police Memorial Day

Edited By: Venkata Chari

Updated on: Oct 21, 2023 | 8:57 PM

Police Memorial Day: పోలీసు అమరవీరుల దినోత్సవం దేశ వ్యాప్తం గా అక్టోబరు 21న నిర్వహిస్తారు. పోలీసు అమరవీరుల స్మారక స్థూపానికి, పోలీసు అమరవీరుల చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తారు. అసలు పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారో అందరూ తప్పక తెలుసుకోవాలి.

దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రతి ఏటా ఎంతోమంది పోలీస్ లు ప్రాణాలు అర్పిస్తూ ఉంటారు. 21 అక్టోబర్, 1959 లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సేనల ఆకస్మిక దాడిలో ప్రాణాలు అర్పించిన పది మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల స్మారకార్థం దేశవ్యాప్తంగా పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం సంస్మరణ దినోత్సవాన్ని పోలీసు పతాక దినోత్సవంగా పాటిస్తారు. దేశాన్ని శాంతియుతంగా ఉంచేందుకు వేలాది మంది పోలీసులు తమ జీవితాలను అంకితం చేస్తారు. ఐతే ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు దేశంలో 264 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ లో కూడా ఈ ఏడాది పదుల సంఖ్య లో పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల సంక్షేమం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు, పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఉచిత కోవిడ్‌ వ్యాక్సినేషన్‌, కుటుంబ ఆరోగ్య పరీక్షల శిబిరాలు తదితర అనేక భద్రతా చర్యలు చేపడుతూ ఉంటారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు.

పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు మద్దతు ఇస్తున్నందుకు, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, ట్రైనింగ్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక విభాగాలలో పనిచేస్తున్న పోలీసులకు ప్రత్యేక అలవెన్స్‌లు ఆయా ప్రభుత్వాలు నుంచి పోలీసులకు అందుతూ ఉంటాయి. ఇక 2023 అక్టోబరు 21 నుంచి 31 వరకు తెలంగాణ లోని రాచకొండ కమిషనరేట్‌ వ్యాప్తంగా పోలీసు పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు, ఆన్‌లైన్‌ ఓపెన్‌ హౌస్‌, ఫోటోగ్రఫీ, షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు సీపీ చౌహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఇతర పౌరులు చురుకుగా పాల్గొనాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు సీపీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితో మమేకమై, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇలా 1959లో లడక్ లో జరిగిన మారణ హోమం లో ప్రాణాలర్పించి దేశాన్ని కాపాడిన ప్రతి యేట అక్టోబర్21న దేశవ్యాప్తంగా పోలీసు సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..