చేపల కూర ఇష్టంగా తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే మీ మైండ్ బ్లాంక్!
మీకు చేపలు అంటే ఇష్టమా..? వారంలో రెండు, మూడు సార్లు పులుసు లేదా ఫ్రై లాగిస్తారా. చికెన్ మటన్‌తో పోల్చుకుంటే కొవ్వు తక్కువగా ఉంటుందని చేపలు ప్రిఫర్ చేస్తున్నారా..? అయితే మీరు ఈ విషయం తెలిసుకోవాల్సిందే..! మీరు సముద్రం లేదా నదుల్లో పట్టే చేపలు తింటే పర్వాలేదు. కానీ చెరువుల్లో పెంచే చేపలు తింటే మాత్రం, మీరు షెడ్డు కెళ్లిపోవడం ఖాయం..!

మీకు చేపలు అంటే ఇష్టమా..? వారంలో రెండు, మూడు సార్లు పులుసు లేదా ఫ్రై లాగిస్తారా. చికెన్ మటన్‌తో పోల్చుకుంటే కొవ్వు తక్కువగా ఉంటుందని చేపలు ప్రిఫర్ చేస్తున్నారా..? అయితే మీరు ఈ విషయం తెలిసుకోవాల్సిందే..! మీరు సముద్రం లేదా నదుల్లో పట్టే చేపలు తింటే పర్వాలేదు. కానీ చెరువుల్లో పెంచే చేపలు తింటే మాత్రం, మీరు షెడ్డు కెళ్లిపోవడం ఖాయం..! ఎందుకంటే వాటికి వేస్తోన్న మేత అలాంటిది. పెద్దగా ఖర్చు లేకుండా.. పెద్ద మొత్తంలో లాభాలు అర్జించాలన్న ఉద్దేశంతో కొందరు చేపల చెరువుల యజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
కాసులు కురిపిస్తున్న కోడి వ్యర్ధాల వ్యాపారానికి భాగ్యనగరం అడ్డాగా మారిందా అంటే.. అవుననే సమాధానం వినపడుతోంది. ప్రతి రోజు వందల టన్నుల చికెన్ వేస్ట్ ను అక్రమంగా హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్ళు. కోడి వ్యర్ధాలతో చేపల సాగు చట్ట విరుద్ధమని తెలిసి కూడా యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. అలాంటి చేపలను తింటే ప్రజల ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. ఈ కోడి వ్యర్ధాల రవాణా వెనకున్న ముఠా సభ్యులు ఎవరు..? వేస్ట్ ను ఎక్కడికి తరలిస్తున్నారు..? ఈ డర్టీ దందాలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? తెలసుకుందాం.
హైదరాబాద్ మహానగరంలోని చికెన్ షాపులలో మిగిలి పోయిన కోడి వ్యర్ధ పదార్థాలను కొందరు కేటుగాళ్ళు సిండికేటుగా ఏర్పడి సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన కోడి వ్యర్థాలను మూసాపేట్, అంబర్‌పేట్, అత్తాపూర్ లాంటి ప్రాంతాల్లో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి డంపింగ్ చేస్తున్నారు. చీకటి పడ్డాక కంటైనర్ లారీలలోకి లోడింగ్ చేసి.. ఏపీలోని వినుకొండ, అడ్డంకి, ఏలూరు, గుంటూరులోని చేపల చెరువులకు తరలిస్తున్నారు. ఈ తంతు అంతా చీకటి పడే సమయానికి స్టార్ట్ చేసి, తెల్లవారే సమయానికి చక్కపెట్టేస్తారు. ప్రతి రోజు 300 టన్నుల చికెన్ వేస్ట్ ను గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ నుండి ఆంధ్రకు తరలిస్తున్నారు అంటే వీరి నెట్‌వర్క్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ లో నివసించే అలీముద్దీన్, నయిముద్దీన్, జాఫర్, కలీమ్, షబ్బీర్, అబ్బాస్, నిసార్, సాదిక్ లాంటి కొందరు వ్యక్తులు.. ఆంధ్రాలోని కోటిరెడ్డి, రవి, దీపక్ లాంటి వ్యక్తులతో చేతులు కలిపి సిండికేటుగా ఏర్పడ్డారు. హైదరాబాద్‌లో ఉండే టీమ్ చికెన్ వ్యర్థాలను సేకరిస్తే.. ఏపీలోని మరో టీమ్ చేపల చెరువులకు తరలిస్తుంది. మహానగరంలోని ప్రతి చికెన్ షాప్ నుండి కోడి వ్యర్థాలను సేకరించి మూసాపేట్, అంబర్‌పేట్, అత్తాపూర్ ప్రాంతాల్లోని డంపింగ్ యార్డ్‌లకు తరలిస్తారు. అక్కడ నుండి 20 టన్నుల కంటైనర్ లారీ లలో చికెన్ వేస్ట్‌ను ఆంద్రప్రదేశ్‌లోని వినుకొండ, అద్దంకి, ఏలూరు, గుంటూరులోని చేపల చెరువులకు తరలిస్తారు.
ఇదంతా కూడా రాత్రి 9 గంటలకు స్టార్ట్ చేసి, తెల్లవారుజామున 5గంటల లోపు ముగించేస్తారు. ఇంతా జరుగుతున్నా అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కోడి వ్యర్థాలను చేపల చెరువులకు తరలించడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O MS. No. 56 ను 2016 లోనే తీసుకొచ్చింది. కోడి వ్యర్ధాలను తిని పెరిగిన చేపలను మనుషులు తింటే అనేక రోగాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఈ ముఠా సభ్యులు గత కొన్నేళ్లుగా ఎలాంటి భయం, బెనుకు లేకుండా యథేచ్ఛగా అక్రమ వ్యాపారం సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిని అరికట్టాల్సిన పోలీస్, ఫిషరీస్, రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వేస్ట్ మాఫియా పై ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆంధ్రా, తెలంగాణా పోలీసులు కొంచెం ఫోకస్ పెడితే కోడి వ్యర్థాల రవాణాను అరికట్టవచ్చని కొందరు పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




