
DGP Mahender Reddy – Cyber Lab: తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఉమెన్ సేఫ్టి వింగ్ ఎంతగానో కృషి చేస్తోందని.. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలతో అనుసంధానమై ఉమెన్ సెఫ్టీ వింగ్ పనిచేస్తుందని.. మహిళలను వేధిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. షీ భరోసా సైబర్ ల్యాబ్, NRI సెల్, కౌన్సెలింగ్ కేంద్రం, మానవ అక్రమ రవాణా నిరోధక కేంద్రం, మిస్సింగ్ పర్సన్స్ మానిటరింగ్ సెల్ కేంద్రాలను మంగళవారం డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలు అంజనీ కుమార్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజేపీ మహేందర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉమెన్ సేఫ్టి వింగ్‌లో పనిచేస్తున్న అధికారులను అభినందించారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం.. శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో ఉమెన్ సేఫ్టి వింగ్ ఎంతగానో కృషి చేస్తోందన్నారు. ప్రజలతో అనుసంధానమై ఉమెన్ సేఫ్టి వింగ్ నిరంతరం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టిందన్నారు.
మహిళలపై జరుగుతున్న నేరాలను సత్వరం పరిష్కరించేందుకు సైబర్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. న్యాయస్థానాలలో నేరస్తులకు శిక్షలు పడేలా చూసేందుకు సైబర్ ల్యాబ్ పనిచేస్తుందని వెల్లడించారు. నేరాలకు పూర్తిగా నిర్ములించడానికి సైబర్ ల్యాబ్ విశేష కృషిచేస్తుందని తెలిపారు. మిస్సింగ్ పర్సన్స్ కోసం ఏర్పాటు చేశామని తెలిపారు. 800 పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసులను సైబర్ ల్యాబ్ మానిటరింగ్ చేస్తుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత చాలా ముఖ్యమని అధికారులకు సూచించారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో 7 లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని పేర్కొన్నారు. నేరం జరిగితే వెంటనే దొరికి పోతామనే భయాన్ని సీసీటీవీ కెమెరాలు రుజువుచేస్తున్నాయని తెలిపారు. గత 6 సంవత్సరాల్లో నేరస్తులకు 58 శాతం శిక్షలు పడేలా చేశామన్నారు. టెక్నాలజీని ఉపయోగించి నేరాలను కంట్రోల్ చేస్తున్నామని వెల్లడించారు.
Inauguration of #SheCyberLab – Women Safety Wing.https://t.co/O9RENaoRJ4
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) November 2, 2021
Also Read: