Adilabad Agency: ఆదిలాబాద్ ఏజెన్సీలో దడ పుట్టిస్తున్న విష జ్వరాలు.. రోజురోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య..
Adilabad Agency People Face Viral Fevers: ఆదిలాబాద్ ఏజెన్సీని విష జ్వరాలు వణికిస్తున్నాయ్. ఒకవైపు స్వైన్ ఫ్లూ కేసులు, మరోవైపు వైరల్ ఫీవర్ పేషెంట్లతో నిండిపోతోంది ఆదిలాబాద్ రిమ్స్.
Adilabad Agency: ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. ఒకవైపు స్వైన్ ఫ్లూ కేసులు.. మరోవైపు డెంగ్యూ, వైరల్ ఫీవర్స్‌తో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు. తీవ్ర జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. జిల్లాలోని నేరడిగొండ, సిరికొండ మండలాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కుంటాల బాలికల ఆశ్రమ పాఠశాలలో విష జ్వరాలతో తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో పిల్లలు వైరల్ ఫీవర్ బారినపడ్డారు. విష జ్వరాలతో ఆదిలాబాద్ రిమ్స్‌లో చేరుతోన్న బాలికల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కుంటాల బాలికల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్ధిని రాథోడ్ భాగ్యశ్రీ మృత్యువాత పడటంతో భయాందోళనలు చెందుతున్నారు తల్లిదండ్రులు. ఇంకా, ఆరుగురు విద్యార్ధినులు తీవ్ర జ్వరంతో రిమ్స్‌లో చేరడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం, 21మంది స్టూడెంట్స్ విష జ్వరాలతో ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
కలుషిత నీటి కారణంగానే స్టూడెంట్స్ అనారోగ్యం బారినపడుతున్నారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. పారిశుద్ధ్య లోపం, అపరిశుభ్రత కారణంగానే విష జ్వరాలు విజృంభిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి పర్యటించిన తర్వాత కూడా ఆశ్రమ పాఠశాలల్లో మార్పు రావడం లేదంటున్నారు. పిల్లలు ప్రాణాలు పోతున్నా, హాస్టల్స్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో పట్టించుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు, ఆదివాసీ సంఘాలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..