ధనియాలు నానబెట్టిన నీళ్లు రోజూ ఉదయాన్నే తాగితే జరిగేదిదే!

18 December 2024

TV9 Telugu

TV9 Telugu

'వివాహ భోజనంబు వింతైన వంటకంబు..' అన్న చందంగా మాంచి విందు భోజనం తర్వాత మొదలవుతుంది అసలు సమస్య.. అదేనండీ.. అజీర్తి

TV9 Telugu

దీనివల్ల కడుపులో తిప్పడం, అసౌకర్యంగా అనిపించడం, కొన్ని సందర్భాల్లో వాంతులవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ సమస్య నుంచి ఉపశమనం మన వంటగదిలోనే దొరకుతుంది

TV9 Telugu

కొన్ని ధనియాలు వేయించి గ్లాసు మజ్జిగలో కలుపుకొని తాగాలి. లేదంటే యాలకులు, వేయించిన ధనియాలు, రెండు లవంగాలు, కాస్త అల్లం.. ఇవన్నీ కలిపి మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి

TV9 Telugu

ఈ పేస్ట్‌ను చెంచా చొప్పున రోజుకు రెండు సార్లు తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ధనియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రోజూ ధనియా వాటర్ గ్లాస్ తాగితే శరీరంలో వచ్చే మార్పులు అన్నీఇన్నీ కావు

TV9 Telugu

ధనాయాలలో డైటరీ ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, విటమిన్ సి, ఎ, బి6 వంటి పోషఖాలు పుష్కలంగా ఉంటాయి. గ్లాసుడు నీళ్లలో కాసిన్ని ధనియాలు వేసిరాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగి చూడండి

TV9 Telugu

ఈ  నీరు శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి కూడా త్రాగాలి. అలాగే ఈ నీరు తాగడం వల్ల ఎసిడిటీ సమస్య దూరం అవుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది

TV9 Telugu

దానియా నీటిని తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, డిప్రెషన్ నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఆరోగ్య లక్షణాలు థైరాయిడ్ రోగులకు రెట్టింపు ప్రయోజనాలను అందిస్తాయి 

TV9 Telugu

ఇందులోని మూలకాలు థైరాయిడ్‌ను నియంత్రిస్తాయి. కాలేయం, కిడ్నీలకు సహజంగా డిటాక్సిఫై అవుతుంది. ఫ్యాటీ లివర్‌ ఉన్నవారు ధానియా నీటిని తప్పక తీసుకోవాలి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా ధనియాల నీరు దివ్యౌషధంగా పనిచేస్తాయి