తల్లి మీద ఉన్న ప్రేమను వినూత్నంగా చాటుకుంది ఓ కూతురు.. జన్మనిచ్చిన తల్లికి అరుదైన గిఫ్ట్ ఇవ్వాలని భావించింది. అంతిమంగా చంద్రమండలంపైనే భూమిని కొనుగోలు చేసింది. అక్కడికి వెళ్లలేమని
తెలిసినా కూడా చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించిన తల్లిపై ఉన్న మమకారంతో చంద్రుడిపై ఒక ఎకరం భూమిని కొని కన్న తల్లి సొంతం చేసింది. తల్లి కి ఇలా గిఫ్ట్ ఇవ్వడం చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని GM కాలనీలో నివాసముండే సింగరేణి ఉద్యోగి సుద్ధాల రాంచందర్, వకుళదేవి దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు సుద్దాల సాయి విజ్ఞత పది సంవత్సరాలు గా అమెరికాలో స్థిరపడింది. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో గవర్నర్ కిమ్ రెనాల్స్ వద్ద ప్రాజెక్టు మేనేజర్‌గా, ఫైనాన్షియల్ అడ్వయిజర్‌గా పని చేస్తుంది. తన కార్యాలయంలో చంద్రుడిపై భూమి కొనుగోలు విషయమై ఓ సారి చర్చ జరిగింది. అప్పటికే తల్లికి అరుదైన గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్న సాయి విజ్ఞత చంద్రుని పై భూమిని కొని తన తల్లికి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుంది.
మథర్స్ డే సందర్బంగా 2022 మార్చ్ 8న చంద్రుడిపై ఒక ఎకరం భూమి కొనుగోలుకు లూనార్ రిజిస్టేషన్ ద్వారా దరఖాన్తు చేసుకుంది. ఈ నెల 23న వకుళ, ఆమె మనుమరాలు ఆర్త సుద్దాల పేరుపై చంద్రుడిపై ఒక ఎకరం భూమి రిజిస్టేషన్ జరిగింది. చంద్రమండలంలో తన పేరుపై కూతురు సాయి విజ్ఞత భూమి కొనుగోలు
చేయడం పట్ల తల్లి వకుళ, తండ్రి రాంచందర్ ఆనందంలో ముగినిపోయారు.
దేశంలో చంద్రయాన్-3 విజయవంతం అయిన రోజునే రిజిస్టేషన్ పత్రాలు చేతికందడం పట్ల కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. తన తల్లికి ఎవరు ఇవ్వని బహుమతి ఇవ్వాలనేది తన కోరిక అని, ఎట్టకేలకు తన కోరిక నెరవేరిందని సాయి విజ్ఞత ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..