AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కన్యాదానం తంతు ముగియగానే.. పెళ్లి కుమార్తె తండ్రికి గుండెపోటు.. ఆస్పత్రికి తీసుకెళ్లగా

చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు... నిండుగుండెలు నిలువునా ఎండిపోతున్నాయి. ఉన్నపళంగా ఊపిరి ఆగిపోతోంది... ఇక్కడ అంబులెన్సుల్లేవ్... హాస్పిటల్‌ ట్రీట్‌మెంట్లూ లేవు. కళ్ల ముందే జీవితాలు ఆవిరైపోతుంటే కళ్లు తేలేస్తున్నాం... తప్ప ఏమీ చెయ్యలేని అచేతనావస్థ మనది. తాజాగా తెలంగాణలో మళ్లీ అలాంటి కేసు వెలుగుచూసింది.

Telangana: కన్యాదానం తంతు ముగియగానే.. పెళ్లి కుమార్తె తండ్రికి గుండెపోటు.. ఆస్పత్రికి తీసుకెళ్లగా
Bride Father Balchandram
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Feb 22, 2025 | 12:03 PM

Share

పూర్తి ఆరోగ్యంగా ఉన్నా.. ఎలాంటి సమస్యలు లేకపోయినా.. మనిషి ప్రాణాలు క్షణాల్లో ఆవిరైపోతున్నాయి. అప్పటి వరకూ ఎంతో యాక్టివ్‌గా ఉన్నా అంతలోనే కుప్పకూలిపోతున్నారు. హార్ట్.. స్ట్రోక్.. ఈ పేరు వింటేనే.. గుండె వేగం పెరిగితోంది. రక్తం చిక్కబడినా.. రక్తం గడ్డకట్టినా.. గుండె ఆగిపోయినట్టే. ఆ జీవి ప్రయాణానికి ఎండ్ కార్డ్ పడినట్టే. పూర్తి ఫిట్‌గా ఉన్నా.. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు కదా అని.. హ్యాపీగా ఉండటానికి లేదు. ఉరుకులు.. పరుగుల జీవితంలో ప్రమాదం ఎప్పుడు ఎలా పొంచి ఉందో అర్ధం కావడం లేదు. ఎందుకంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్న వాళ్లు కూడా క్షణాల్లో కింద పడిపోతున్నారు. నిముషాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు.

తాజాగా కూతురు పెళ్లి జరుగుతుండగానే అదే మండపంలో తండ్రి హార్ట్ అటాక్‌తో కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమయిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ షాకింగ్ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్​పల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కుడిక్యాల బాల్​చంద్రం(56) తన పెద్ద కుమార్తె పెళ్లిని శుక్రవారం జంగంపల్లి శివారులోని బీటీఎస్‌ వద్ద ఉన్న కల్యాణమండపంలో ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకకు బంధు మిత్రులంతా హాజరయ్యారు. అయితే వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన బాల్ చంద్ర పెళ్లి మండపంలోనే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. హార్ట్ అటాక్‌తో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పెళ్లింట విషాదం నెలకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ